వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ: 20మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీ అనర్హత వేటు

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. 20మంది ఎమ్మెల్యేలపై ఈసీ అనర్హత వేటు..!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది.

నివేదికను రాష్ట్రపతికి పంపిన ఈసీ.. ఆ 20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది. 2015లో 21మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటీలుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నియమించారు.

Blow for AAP: EC disqualifies 20 MLAs for holding 'office of profit'

కాగా, ఎమ్మెల్యేలను లాభదాయక పదవుల్లో నిమించారనే అభియోగాలు రావడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో చిక్కులు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు.. ఇది మరో ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఈసీ నిర్ణయాన్ని ఆప్ నేతలు తప్పుపడుతున్నారు. ఈసీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.

అయితే, ఈసీ సిఫారసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆప్ ప్రభుత్వం యోచిస్తోంది. కాగా, ఈసీ నిర్ణయాన్ని కాంగ్రెస్, బీజేపీ స్వాగతిస్తున్నాయి. కేజ్రీవాల్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

English summary
In a big setback for the Aam Aadmi Party (AAP), the Election Commission on Friday disqualified 20 of its MLAs for holding 'office of profit', Times Now has reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X