Super blue moon: నీలి రంగు చందమామ..: ఆకాశంలో మరో అరుదైన అద్భుతం

న్యూఢిల్లీ: అంతరిక్షం.. అద్భుతాలమయం. ఈ విశ్వాంతరాల్లో సంభవించే ప్రతీదీ ఓ ఆశ్చర్యాన్ని కలిగించేదే. ప్రతి అద్భుతానికీ ఓ కారణం ఉంటుంది. కొద్దిరోజుల కిందటే పంచ గ్రహ కూటమి ఏర్పడింది. అయిదు గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేశాయి. బుధుడు, యురేనస్, గురుడు, నెప్ట్యూన్, శని గ్రహాలు.. ఆకాశంలో పరేడ్ చేశాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండానే నేరుగా వీక్షించగలిగారు.

ఇప్పుడు అలాంటి అరుదైన సందర్భం మరోసారి చోటు చేసుకుంది. ఈ ఆగస్టు నెలలో రెండు పున్నములు ఏర్పడబోతోన్నాయి. ఇందులో ఒకటి ఈ నెల 1వ తేదీన సంభవించింది. దాన్ని సూపర్‌ మూన్‌గా పిలిచారు. మరొకటి ఈ నెల 30వ తేదీన అంటే బుధవారం చోటు చేసుకోబోతోంది. ఇది సూపర్ బ్లూ మూన్.

Blue Moon 2023: Moon is closer to the Earth

సాధారణంగా ఒక ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్‌మూన్‌లు ఏర్పడుతుంటాయి. బుధవారం ఏర్పడబోయే సూపర్‌ బ్లూ మూన్‌ మాత్రం చాలా అరుదు. అలాంటి సందర్భాన్ని మళ్లీ 2032, 2037 వరకు మనం చూడలేకపోవచ్చు. ఫుల్ మూన్ సమయంలో, జాబిల్లి కక్ష్య భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్‌మూన్ ఆవిష్కృతమౌతుంది.

సాధారణ పౌర్ణమి రోజుల కంటే కూడా సూపర్ మూన్ సమయంలో చందమామ మరింత ప్రకాశవంతంగా కనువిందు చేస్తాడు. పరిమాణంలోనూ భారీగా కనిపిస్తాడు. బుధవారం రాత్రి ఉదయించే చంద్రుడు కూడా మరింత వెన్నెల పంచబోతోన్నాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెల వెలుగు అధికంగా కనిపిస్తుంది.

ఒకే నెలలో రెండవసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మూన్‌గా భావిస్తారు. సగటున ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఇలాంటి సందర్భం ఏర్పడుతుంటుంది. ఒకే నెలలో రెండు పున్నములు సంభవిస్తుంటాయని నాసా తెలిపింది. ఒక సూపర్‌మూన్, బ్లూ మూన్‌తో కలిసి రావడం అరుదైన సందర్భమే.

ఇది చివరిసారిగా 2009 డిసెంబర్‌లో ఇది సంభవించిందని నాసా పేర్కొంది. మళ్లీ 2032, 2037 ఆగస్టులో ఇది ఏర్పడుతుంది. ఆగస్టు 30వ తేదీ నాటి పున్నమి చంద్రుడిని బ్లూ మూన్‌గా పిలుస్తారు. అంతే తప్ప చందమామ నిజంగా నీలం రంగులో కనిపించదు. హిందూ సంప్రదాయంలో ఒకే నెలలో సంభవించే రెండు పున్నములకు ప్రాధాన్యత ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+