• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలీవుడ్ గ్లామ్ డాల్ మలైకాకు కరోనా పాజిటివ్.. బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌కు వచ్చిన కొద్ది గంటల్లోనే.

|

ముంబై: దేశవ్యాప్తంగా కరోనావైర్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి పలువురు ప్రముఖులు కూడా మృతి చెందారు. తాజాగా బాలీవుడ్ భామ ఐటెం సాంగ్ ముద్దుగుమ్మ మలైకా అరోరా కూడా కరోనా బారిన పడింది. ఈ విషయం స్వయంగా ఆమెనే తన ఇన్స్‌టాగ్రాం ద్వారా వెల్లడించింది. అయితే మలైకా డేట్ చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ నటుడు అర్జున్ కపూర్... తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన కొన్ని గంటల్లోనే మలైకా కూడా తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యిందని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  COVID-19 Vaccines Tracker : కరోనా టీకాలు- ఏ వ్యాక్సిన్ ఎంత, ఎప్పుడు వస్తుంది ! || Oneindia Telugu

  బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని నిన్న అంటే ఆదివారం ప్రకటించారు. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పిన అర్జున్ కపూర్ ఎవరూ ఆందోళన చెందొద్దంటూ ఇన్స్‌టాలో పోస్టు చేశాడు. ఇక మలైకా అరోరా కూడా ఇన్స్‌టాలో పోస్టు చేసింది. ఈ రోజు కరోనావైరస్ టెస్టులు చేయించుకోగా తనకు పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు చెప్పుకొచ్చిన మలైకా... ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం అసింప్టోమాటిక్‌ అంటే కరోనా లక్షణాలు కనిపించడం లేదని కానీ టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో తన డాక్టర్ల సలహా మేరకు హోంక్వారంటైన్‌లో ఉంటున్నట్లు చెప్పింది. తనను కలిసిన వారు కూడా జాగ్రత్తగా ఉండాలని మలైకా ఇన్స్‌టాలో సూచించారు.

  Bollywood Actress Malaika Arora tested Positive for Coronavirus

  మలైకా అరోరా చేసిన ఈ పోస్టుకు చాలా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు తోటి నటీమణులు బిపాషా బసు, కాజల్ అగర్వాల్, నమ్రతా పురోహిత్, నీనా గుప్తాతో పాటు మరికొందరు మలైకా వెంటనే కోలుకోవాలంటూ కామెంట్స్ రాశారు. ఇదిలా ఉంటే మలైకా ఈ మధ్యకాలంలోనే ఇండియాస్ బెస్ట్ డాన్సర్ అనే రియాల్టీ షోలో జడ్జిగా వ్యవహరించింది. ఆ సమయంలో ఏడెనిమిది మందికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. వీరి నుంచే మలైకాకు వ్యాప్తి చెంది పాజిటివ్ వచ్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ షోను నిర్వాహకులు నిలిపివేసినట్లు సమాచారం.

  ఇదిలా ఉంటే దేశంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 90,802 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42 లక్షల మార్కును దాటింది. అంతేకాదు ఒక్కరోజు నమోదైన కేసుల్లో బ్రెజిల్‌ను భారత్ దాటేసింది. ఇప్పటి వరకు భారత్‌లో ఈ మహమ్మారి బారిన పడి 71వేలకు పైగా మృతి చెందారు.

  English summary
  Arjun Kapoor's rumoured girlfriend and Bollywood's glam doll Malaika Arora is also tested positive for Covid-19. Off late, she took to her Instagram and announced this news officially.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X