బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. ముంబై ఫేమస్ ముచ్చద్ పాన్ వాలాకు లింక్ , రామ్ కుమార్ తివారీ అరెస్ట్
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను వేగవంతం చేసింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. ముంబై నగరం లో ఫేమస్ అయిన ముచ్చద్ పాన్ వాలా కుమారులలో ఒకరైన రామ్ కుమార్ తివారి నిర్వహణలోని గోడౌన్ లో డ్రగ్స్ దొరకడంతో, బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి.

ఫేమస్ ముచ్చద్ పాన్ వాలా గోడౌన్ లో డ్రగ్స్
బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్న పబ్స్ నుండి పాన్ వాలాల దాకా అందరి గుట్టు రట్టు చేసే పనిలో ఉంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.
రామ్‌కుమార్ తివారీ నిర్వహణలోని గోడౌన్ లో డ్రగ్స్ దొరికాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. ప్రసిద్ధ ముచ్చద్ పాన్వాలా దుకాణాన్ని ప్రారంభించిన శ్యామ్‌చరణ్ తివారీ నలుగురు కుమారులలో ఆయన ఒకరు. ముంబై లో ఫేమస్ అయిన ముచ్చద్ పాన్ వాలా యజమానులలో ఒకరైన రామ్‌కుమార్ తివారీని మంగళవారం ఉదయం అరెస్టు చేసింది.

యజమానులలో ఒకరైన రామ్‌కుమార్ తివారీ అరెస్ట్
1970 ల చివరలో దక్షిణ ముంబైలోని కెంప్స్ కార్నర్‌లో ప్రసిద్ధ ముచ్చద్ పాన్వాలా దుకాణాన్ని ప్రారంభించిన శ్యామ్‌చరణ్ తివారీ పాన్ షాప్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు . ముంబైలో ఇప్పటికీ ఇది ఫేమస్ పాన్ షాప్ .
ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రామ్ కుమార్ తివారి అరెస్టును ధృవీకరించారు. అతన్ని కోర్టు ముందు హాజరు పరుస్తామని వెల్లడించారు. అయితే ఎన్‌సిబి అధికారులు గోడౌన్ లో దొరికిన డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు ఇవ్వలేదు.

ఎన్‌సిబి దర్యాప్తులో ముచ్చద్ పన్వాలా పేరు .. తీగ లాగితే కదులుతున్న డొంక
పాన్ షాపులో పనిచేస్తున్న ఇతరులను విచారిస్తున్నామని, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను పరీక్ష కోసం పంపించామని వాంఖడే చెప్పారు. జనవరి 9 న బాంద్రా నుంచి బ్రిటిష్ జాతీయుడు కరణ్ సెజ్నాని, సోదరీమణులు రహీలా, షైస్తా ఫుర్ంటియురేవాలాలను అరెస్టు చేసిన నేపథ్యంలో వారి వద్ద నుండి సుమారు రెండు వందల కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌సిబి దర్యాప్తులో ముచ్చద్ పన్వాలా పేరు ప్రధానంగా వినిపించడంతో రామ్‌కుమార్ తివారీ సోదరుడు జైశంకర్ తివారీ ని సోమవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ నిమిత్తం పిలిచారు.
Recommended Video

2 కిలోల గంజాయి స్వాధీనం ..కేసు నమోదు
బాంద్రాలోని కొరియర్ సర్వీస్ కంపెనీ కార్యాలయం నుండి మూడు పొట్లాలలో నిల్వ చేసిన 340 గ్రాముల గంజాయిని ఏజెన్సీ స్వాధీనం చేసుకున్న తరువాత, ఎన్సిబి సెజ్నానిని అరెస్ట్ చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఖార్ వద్ద ఉన్న సెజ్నాని యొక్క ఫ్లాట్ పై దాడి చేసి, 194.6 కిలోల దిగుమతి చేసుకున్న వివిధ రకాల గంజాయి బ్యాగులను కనుగొన్నారు. అతని విచారణ తరువాత, అధికారులు బాంద్రాలోని రాహిలా మరియు షైస్టా ఫర్నిచర్ వాలా ఇంటిపై దాడి చేసి, కొద్దిపాటి డ్రగ్స్ ను కనుగొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వారిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications