ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. నాగ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్..
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఇండిగో ఫ్లైట్‌ను అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. జబల్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇండిగో 6ఈ 7308 విమానంలో బాంబు ఉన్నట్లు నేటి (ఆదివారం) ఉదయం 8గంటలకు మెయిల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఇండిగో ఫ్లైట్ సర్వీస్ సంస్థ నాగ్ పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసింది. బాంబ్ ఉందంటూ థ్రెట్ మెయిల్స్ వచ్చిన వెంటనే విమానాన్ని అధికారులు నేటి ఉదయం ఎనిమిది గంటలకు నాగ్ పూర్ ఎయిర్‌పోర్ట్‌కు మల్లించారు. అనంతరం హుటాహుటినా ప్రయాణికులను కిందకు దించి, విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లోని ఐసోలేషన్ బేకు తరలించారు.
ఇండిగో విమానంలో బాంబ్ ఉందంటూ మెయిల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లైట్‌ను అత్యవసర ల్యాండింగ్ చేసి విమానయాన సంస్థ ప్రయాణికులకు సహాయం, బ్రేక్ ఫాస్ట్ అందించింది. ఈ బెదిరింపు మెయిల్స్‌తో అసౌకార్యానికి గురైన ప్రయాణికులకు ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పింది. ఆ తర్వాత ఐసోలేషన్ బేలో ఉన్న ఫ్లైట్‌ను చెక్ చేసింది. అయితే, ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ కనిపించలేదు.

దీంతో ప్రయాణికులతో పాటు ఇండిగో సంస్థ కూడా ఊపిరీ పీల్చుకుంది. ఇటీవలి కాలంలో విమానాశ్రయాలు, ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ తరచుగా రావడం మనం చూస్తున్నాం. జూన్ 18వ తేది జైపూర్, చెన్నై, వారణాసి సహా 41 విమానాశ్రయాలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆగస్ట్ 22వ తేది కూడా ఎయిర్ ఇండియా విమానానికి ఇలాగే ఇలాంటి న్యూసే ఒకటి అందింది. ఇటువంటి చర్యలకు పాల్పడినవారిపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ఐదేళ్ల నిషేధాన్ని ప్రతిపాదించింది.












Click it and Unblock the Notifications