వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Boycott cadbury:ట్విట్టర్‌లో ట్రెండింగ్, కారణమిదే, గతంలో కూడా

|
Google Oneindia TeluguNews

కొందరి పేర్లు, ఇంటి పేర్లతో వివాదం నెలకొంటుంది. ఇప్పుడు ప్రధాని మోడీ తండ్రి పేరు మీద కాంట్రవర్సీ జరుగుతుంది. అయితే వాస్తవానికి ఆ పేరును ఓ సంస్థ అనుకోకుండా వాడేసింది. దీంతో వివాదం రాజేసింది. ఏకంగా ఆ కంపెనీ ఉత్పత్తులు బ్యాన్ చేయాలని అనేవరకు వెళ్లింది. దీపావలి సందర్భంగా కంపెనీ చేసిన యాడ్ వారిని మింగుడు పడనివ్వడం లేదు.

మనం ఇప్పటివరకు డిస్కష్ చేసింది క్యాడ్బరీ గురించే. ట్విట్టర్‌లో బాయ్ కాట్ క్యాడ్బరీ ఉద్యమం జరుగుతుంది. దీపావళి సందర్భంగా క్యాడ్బరీ రూపొందించిన వీడియో ప్రకటన అగ్గి రాజేసింది. ఆ ప్రకటనలో ప్రధాని మోడీ తండ్రి పేరు 'దామోదర్' యూజ్ చేశారు. ఆ యాడ్‌లో ఓ వృద్ధుడు తోపుడు బండిపై ప్రమిదెలను విక్రయిస్తుంటాడు. అతని పేరు దామోదర్. అతడిని వెతుక్కుంటూ ఓ సూట్ దరించిన వ్యక్తి వచ్చి, గిఫ్ట్ గా క్యాడ్బరీ చాక్లెట్ల ప్యాక్ అందజేస్తాడు. ఇదీ విషయం.. దీనిని కొందరు కాంట్రవర్సీ చేశారు.

Boycott cadbury trend in social media twitter

వీడియోను ట్విట్టర్‌లో విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి పోస్ట్ చేశారు. ప్రకటనలో ప్రధాని మోడీ తండ్రి పేరును ఉపయోగించడం సరికాదన్నారు. టీవీ చానల్స్‌లో క్యాడ్బరీ చాక్లెట్స్ ప్రకటనను పరిశీలించారా? షాపు లేని ఓ నిరు పేద ల్యాంప్ విక్రేత పేరు దామోదర్. ప్రధాని నరేంద్ర మోడీ తండ్రి పేరును తక్కువ చేయడానికి చేసిన ప్రయత్నం ఇది అని అన్నారు. ఇందుకు ఆ కంపెనీ సిగ్గు పడాలని.. బాయ్ కాట్ క్యాడ్బరీ అని పోస్ట్ చేశారు.

క్యాడ్బరీ కంపెనీ బ్రిటన్‌కు చెందినది. దీని మాతృసంస్థ మోండెలెజ్ ఇంటర్నేషనల్.. కానీ దేశీ చాక్లెట్ల మార్కెట్లో పెద్ద మొత్తంలో వాటా ఉంది. చాక్లెట్ల తయారీలో గొడ్డు మాంసం కలుపుతున్నారని 2021లో ఆరోపణలు కూడా వచ్చాయి. భారత్‌లో తయారు చేస్తున్నవీ నూరు శాతం శాఖహార ఉత్పత్తులేనని వివరణ ఇచ్చింది.

English summary
Boycott cadbury trend in social media twitter. they are use name of damodar for diwali add.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X