వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ .. సోషల్ మీడియా ఉద్యమం బానే ఉన్నా .. రియాల్టీ ఇదే !!

|
Google Oneindia TeluguNews

గత కొద్ది రోజులుగా భారత్-చైనా సరిహద్దు వాస్తవాధీనరేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనాపై భారతదేశం ఆగ్రహంతో ఉంది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలోనే కరోనా వైరస్ రావడానికి కారణం చైనా అని భావించి బాయ్ కాట్ చైనా అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక ఉద్యమం మొదలైంది. ఇక ఇప్పుడు పెద్ద ఎత్తున బాయ్ కాట్ చైనా అంటూ దేశ వ్యాప్త ఉద్యమం కొనసాగుతున్న వేళ వాస్తాలు ఎలా ఉన్నాయి. జరుగుతున్న ఉద్యమ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ .

India China Border Issue: ఇండియా టార్గెట్ గా చైనా హ్యాకర్లు .. సైబర్ ఇంటిలిజెన్స్ సంస్థ హెచ్చరికIndia China Border Issue: ఇండియా టార్గెట్ గా చైనా హ్యాకర్లు .. సైబర్ ఇంటిలిజెన్స్ సంస్థ హెచ్చరిక

 బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్, బ్యాన్ చైనాయాప్స్ అంటూ సోషల్ మీడియాలో ఉద్యమం

బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్, బ్యాన్ చైనాయాప్స్ అంటూ సోషల్ మీడియాలో ఉద్యమం

ఇక తాజాగా లడఖ్ లో చైనా సైనికులతో భారత సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైన్యం వీర మరణం పొందిన తర్వాత చైనా మీద భారతీయుల ఆగ్రహజ్వాలలు మిన్ను ముడుతున్నాయి. దీంతో బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్, బ్యాన్ చైనాయాప్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఉద్యమం మొదలైంది. చైనా వస్తువులను బ్యాన్ చేయాలని, వాటిని బహిష్కరించాలని జరుగుతున్న ఉద్యమంలో భాగంగా కొందరు చైనా ఉత్పత్తులైన, టీవీలను, ఫోన్లను పగలగొట్టడం,చైనా వస్తువులను తగలబెట్టడం వంటి ఘటనలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.

బాయ్ కాట్ చైనా ఉద్యమం సోషల్ మీడియాలో ప్రచారానికే పరిమితమా ?

బాయ్ కాట్ చైనా ఉద్యమం సోషల్ మీడియాలో ప్రచారానికే పరిమితమా ?

ఇక ఇదే క్రమంలో సోషల్ మీడియాలో కూడా Boycott china, ban china apps ,Go china అంటూ నెటిజన్లు చైనాపై తమ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇక టీవీ షోలలో సైతం చైనా వస్తువులను చైనా యాప్స్ ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిబేట్లు నిర్వహిస్తున్నారు. అయితే బాయ్ కాట్ చైనా క్యాంపెయిన్ డిబేట్ లు నిర్వహించిన టీవీ ఛానల్స్ లోనే పవర్డ్ బై వివో, ఒప్పో అని రావడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంది. బాయ్ కాట్ చైనా అనేది సోషల్ మీడియాలో ప్రచారం ఎలా మారింది తప్ప వాస్తవంగా మాత్రం చైనా ఉత్పత్తులను వాడేవారు మనదేశంలో గణనీయంగా ఉన్నారు.

భారతీయుల జీవితంలో తెలియకుండానే భాగంగా మారిన చైనీస్ ప్రొడక్ట్స్

భారతీయుల జీవితంలో తెలియకుండానే భాగంగా మారిన చైనీస్ ప్రొడక్ట్స్

బాయ్ కాట్ చైనా అంటున్నవారే చేతిలో చైనీస్ మొబైల్ పట్టుకొని, చైనీస్ యాప్ అయిన టిక్ టాక్ ను దర్జాగా చూస్తున్నారు. ఇక అంతేకాదు ప్రస్తుతం మనమందరం వీడియో కాన్ఫరెన్స్ లకు యూజ్ చేస్తున్న జూమ్ యాప్ కూడా చైనా యాప్ కావడం గమనార్హం. ఇక వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే ప్రస్తుతం వ్యాపార వర్గాల లెక్కల ప్రకారం కూడా, బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ క్యాంపెయిన్ తో చైనా కంపెనీలకు పెద్దగా నష్టం జరిగినట్లుగా కనిపించటంలేదు.

 చైనా ప్రొడక్ట్స్ పై జరుగుతున్న ప్రచారం ఎఫెక్ట్ చైనా కంపెనీలపై ఉందా?

చైనా ప్రొడక్ట్స్ పై జరుగుతున్న ప్రచారం ఎఫెక్ట్ చైనా కంపెనీలపై ఉందా?

చైనీస్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్లు అయిన షావోమీ,హయ్యర్, ఒప్పో, వివో, రియల్ మీ వంటి మొబైల్ సేల్స్ ఇండియాలో ఏ మాత్రం తగ్గలేదు. ఇండియాలో ఎవరూ చైనీస్ మొబైల్స్ ను కొనకూడదని అనుకోవడం లేదు అని వ్యాపార వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకువచ్చినప్పటికీ భారతదేశంలోని మానవజీవితంలో ప్రతి ఒక్క అంశంలో ముడిపడి ఉన్న చైనా ప్రొడక్ట్స్ ను లేకుండా చేయడం అంత సామాన్యమైన విషయం కాదు.

 గతంలోనూ చాలాసార్లు బ్యాన్ చైనా క్యాంపెయిన్.. కానీ సక్సెస్ అవుతుందా అన్నదే ప్రశ్న

గతంలోనూ చాలాసార్లు బ్యాన్ చైనా క్యాంపెయిన్.. కానీ సక్సెస్ అవుతుందా అన్నదే ప్రశ్న

ఇక సోషల్ మీడియాలో Boycott china ,Go china, Ban china , Go Chinese Go అనే హ్యాష్ టాగ్స్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి.ఇలా ఎంత ప్రచారం చేసినా ఫలితం ఉంటుందా అన్నది అనుమానమే.ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే మన దేశంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో చైనా ప్రొడక్ట్స్ వాడకూడదు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా అది కేవలం ప్రచారంగానే మిగిలింది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చైనా విషయంలో సీరియస్ గా ఉన్న పరిస్థితులతో కొంతలో కొంతైనా చైనా ఉత్పత్తుల ప్రభావం భారత్ మీద తగ్గుతుంది అని భావన వ్యక్తమవుతోంది.

English summary
It is not uncommon to do without Chinese products that are intertwined with every aspect of human life in India. The hashtags on Boycott china, Go china, Ban china, Go Chinese Go are trending on social media. Even according to business figures, the Boycat China Products campaign does not appear to have caused much damage to Chinese companies. Mobile brands such as Shawomi, Hier, Oppo, Vivo, Real Me, Chinese brands smart phones have not declined in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X