Lovers: బాయ్ ఫ్రెండ్ కు ఎలా విషం పెట్టి హత్య చేశానంటే ?, గిరిష్మా ఇంటిలో ?, సీక్రేట్ ప్లేస్ !

కన్యాకుమారి/తిరువనంతపురం: ప్రేమించిన ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేసిన ప్రియురాలు గిరిష్మా కేరళ పోలీసుల విచారణలో అనేక విషయాలు చెబుతోందని సమాచారం. ప్రియుడిని హత్య చేసి కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న గిరిష్మా ప్లాన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ప్రియుడి హత్య కేసు నుంచి తప్పించుకోవాలని అనుకున్న గిరిష్మా ఇన్ని రోజులు కేరళ పోలీసులకు అనేక స్టేట్ మెంట్ లు ఇచ్చింది. అయితే కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, తమిళనాడు పోలీసులు ఎంట్రీ కావడంతో గిరిష్మాకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. గిరిష్మాను ఆమె ఇంటికే పిలుచుకుని వెళ్లిన పోలీసులు వివరాలు సేకరించారు. గిరిష్మా, ఆమె ప్రియుడు షారోన్ రాజ్ తిరిగిన ప్రాంతాలకు గిరిష్మాను పిలుచుకుని వెళ్లి పూర్తి సమాచారం బయటకు లాగేస్తున్నారు.

 లవర్స్ ఎంజాయ్

లవర్స్ ఎంజాయ్

కేరళలోని పరసాల మురియాంకరై ప్రాంతానికి చెందిన షారోన్ రాజ్ అలియాస్ షారోన్ (23) అనే యువకుడు, తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కలియకవిలై సమీపంలోని రామవర్మన్ సిరై ప్రాంతంలో నివాసం ఉంటున్న కాలేజ్ అమ్మాయి గిరిష్మా (22) ప్రేమించుకుని చాలాకాలం ఎంజాయ్ చేశారు.

 ప్రియుడు ఉండగానే ప్రియురాలు ?

ప్రియుడు ఉండగానే ప్రియురాలు ?

ప్రియుడు షారోన్ తో తిరుగుతున్న సమయంలోనే ఇంట్లో చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని గిరిష్మా డిసైడ్ అయ్యింది. నన్ను కాదని నువ్వు వేరే యువకుడిని పెళ్లి చేసుకుంటే గతంలో మనం తీసుకున్న ఫోటోలు, వీడియోలు నీకు కాబోయే భర్తకు పంపిస్తానని షారోన్ గిరిష్మాను బెదిరించాడని సమాచారం.

 పక్కాప్లాన్ తో చంపేసింది

పక్కాప్లాన్ తో చంపేసింది

మొబైల్ ఫోన్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు డిలీట్ చెయ్యడానికి షారోన్ అంగీకరించకపోవడంతో గిరిష్మాతో గొడవ జరిగింది. ప్రియురాలు గిరిష్మా ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పడం, షారోన్ ఆమె ఇంటికి వెళ్లడం, గిరిష్మా జ్యూస్ లో విషం కలిపి ఆమె ప్రియుడు షారోన్ కు ఇవ్వడం, చికిత్స విఫలమై అతను చనిపోవడం జరిగిపోయింది.

 మ్యాటర్ రివర్స్

మ్యాటర్ రివర్స్

హత్యకు గురైన షారోన్ రాజ్ ఇల్లు కేరళలో ఉంది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కేరళ సరిహద్దులో గిరిష్మా ఇల్లు ఉంది. షారోన్ కు విషయం పెట్టింది గిరిష్మా ఇంటిలో. షారోన్ చనిపోయాడు. ఈ కేసును కేరళ పోలీసులు తమిళనాడు పపోలీసులకు అప్పగించారు.

 పిన్ టూ పిన్ బయటకు లాగేశారు

పిన్ టూ పిన్ బయటకు లాగేశారు

కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, తమిళనాడు పోలీసులు ఎంట్రీ కావడంతో గిరిష్మాకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. గిరిష్మాను ఆమె ఇంటికే పిలుచుకుని వెళ్లిన పోలీసులు వివరాలు సేకరించారు. గిరిష్మా, ఆమె ప్రియుడు షారోన్ రాజ్ తిరిగిన విహారయాత్రలు, రహస్య ప్రాంతాలకు గిరిష్మాను పిలుచుకుని వెళ్లి పూర్తి సమాచారం బయటకు లాగేస్తున్నారు. షారోన్ కు ఎలా విషం పెట్టి హత్య చేశాను అని గిరిష్మా పూర్తిగా పిన్ టూ పిన్ చెప్పిందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+