ఎంతకు తెగించార్రా.. భారత్ లో ఉంటూ పాక్ డబ్బుతో జల్సాలు.. 8 మంది గూఢచారులు అరెస్ట్
భారత్ లో ఉంటూ.. భారత్ ఫుడ్ తింటూ.. పాకిస్థాన్ కు గూఢచర్యం చేసిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా పాక్ నుంచి డబ్బు తీసుకుని ఇక్కడి రహస్య సమాచారాన్ని.. పోలీసులు, అధికారుల కదలికలను ఎప్పటికప్పుడు పాకిస్థాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో వ్లాగర్, స్టూడెంట్, బిజినెస్ మ్యాన్.. తదితరులు ఉన్నారు. వీరి అరెస్టుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. అనుమానం ఉన్న వ్యక్తులపై నిఘా పెంచారు.
వీళ్లంతా భారతీయులే.. కానీ శత్రువు కోసం పని చేశారు. పాక్ డబ్బును ఆశగా చూపిస్తే లొంగిపోయారు. భారత్ లోనే ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా ఇక్కడి సున్నితమైన సమాచారాన్ని ఆ దేశ ఏజెంట్లకు పంపించారు. ఇందుకోసం ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లు ఉపయోగించారు. పహల్గాం ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా పోలీసులు, అధికారులు దర్యాప్తులు చేపట్టడంతో వీళ్లు బయట పడ్డారు. 8 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్లపై గూఢచర్యం కింద కేసులు నమోదు చేశారు. భారత్ లో ఇలాంటి వాళ్లు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటున్నారు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పాకిస్థాన్ లో పర్యటించి అక్కడి నాయకులు, ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకుంది. ఇక్కడి సున్నితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసింది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఆమె కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

అరెస్టయిన మొత్తం 8 మందిలో నలుగురు హరియాణా, ముగ్గురు పంజాబ్, ఒకరు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు. హరియాణాలోని పాటియాలాకు చెందిన దావేంద్ర సింగ్(25)ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది నవంబర్ లో పాకిస్థాన్ కు పోయిన దావేంద్ర సింగ్.. అక్కడి ఐఎస్ఐ ఏజెంట్లతో పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ కు చెందిన ఫోటోలను వాళ్లకు అందించాడు.
హరియాణాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నౌమాన్ ఇలాహీ.. ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అరెస్టు చేశారు. హరియాణాలోని నుహ్ కు చెందిన ఆర్మాన్ ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతనికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. షాజాద్, మహమ్మద్ మూర్తాజా అలీ అనే ఇద్దరినీ ఇదే కారణాలతో అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్లందరినీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications