పెళ్లి పందిట్లోనే వధువు ప్రసవం: పెళ్లికే సిద్ధపడ్డ వరుడు

భోపాల్: భోపాల్: పెళ్లి ముహుర్తానికే ఓ నవ వధువు ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో చోటు చేసుకుంది. అవాక్కయిన వరుడు, వధువు తరఫు పంధువులు బెళ్లిని రద్దు చేయాలని నిర్ణయించారు. వరుడు మాత్రం ససేమీరా అన్నాడు.

వివాహ వేడుకలో ముహూర్తం దగ్గర పడుతుండగా అనూహ్యంగా వివాహ వేదిక పైనే వధువు ఓ బిడ్డను ప్రసవించింది. వరుడి బంధువులకు కోపం కట్టలు తెంచుకుంది. వివాహం రద్దయినట్లేనని ప్రకటించారు. ఆమెను పెళ్లాడితే వరుడికి భారీ జరిమానా తప్పదని పంచాయితీ హెచ్చరించింది.

Bride gives birth to child right during her wedding ceremony

కాని వరుడు మాత్రం.. తాను ఆమెనే పెళ్లి చేసుకుంటానని, జీవితాంతం తోడుంటానని నిశ్చితార్థం నాడే ఆమెకు మాటిచ్చానని చెప్పాడు. ఆ తర్వాత ఆమెనే పెళ్లాడాడు.

కాగా, తన కొడుకు చేసిన మంచిపనికి తాను గర్వపడుతున్నానని పంచాయితీ సభ్యులు జరిమానా విధిస్తే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని వరుడి తండ్రి ప్రకటించారు. తన ఇంటికి తల్లీ, బిడ్డలను తీసుకెళ్లాలని వరుడు నిర్ణయించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+