వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీని మళ్లీ గెలిపించండి.. హోళీ రోజు ఫ్రీ సిలిండర్, రైతులకు ఐదేళ్లు ఉచిత విద్యుత్: అమిత్ షా

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మళ్లీ అధికారంలోకి వస్తే హోలీ (మార్చి 18) నాడు ఇంటింటికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం హామీ ఇచ్చారు. దిబియాపూర్, ఔరయాలో మంగళవారం జరిగిన ర్యాలీలో రైతులకు ఉచిత విద్యుత్‌ను కూడా ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్‌లోని దిబియాపూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి షా మాట్లాడుతూ.. 'హోలీ 18న (మార్చి), కౌంటింగ్ 10న, 10న బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, మార్చి 18న మీ ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయని, రైతులందరికీ ఐదేళ్లపాటు ఉచిత విద్యుత్ అందిస్తాం' అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Bring BJP to power in UP on March 10, free gas cylinder on Holi, free electricity to farmers: Amit Shah

యూపీలో బీజేపీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తే ఇంధనం అందిస్తానని ఎస్పీ చీఫ్ అంటున్నారని.. అయితే ఎస్పీ అధికారంలోకి వస్తే స్కూటీగానీ, ఇంధనంగానీ ఉండదు'అని అమిత్ షా అన్నారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేసిన అమిత్ షా, మొదటి, రెండో దశ ఎన్నికల తర్వాత రాష్ట్రం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు.

'సమాజ్‌వాదీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ 300 కంటే ఎక్కువ సీట్లతో బీజేపీ ప్రభుత్వానికి పునాది వేసే పనిని పూర్తి చేసింది. మూడవ దశలో ఈ మెజారిటీని గ్రాండ్‌గా మార్చాలి' అని అమిత్ షా అన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను హేళన చేస్తూ... "అఖిలేష్ (ఎస్పీ చీఫ్) మేమేం చేశామని అడిగారు? ఎవరైనా పసుపు రంగు కళ్లజోళ్లు కలిగి ఉంటే, వారు పసుపు రంగులో మాత్రమే చూస్తారు ... తుపాకులు, బుల్లెట్లు అఖిలేష్ ప్రభుత్వంలో తయారు చేయబడ్డాయి.. ఇప్పుడు 'గోలీ'కి బదులుగా పాకిస్తాన్‌పై కాల్పులు జరపడానికి 'గోలే (మందుగుండు సామగ్రి)' తయారు చేయబడింది అని అన్నారు. ,

ఏడు దశల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం రెండో దశ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

English summary
Bring BJP to power in UP on March 10, free gas cylinder on March 18, free electricity to farmers: Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X