'యూపి ఎన్నికల ఫలితాలపై కోర్టును ఆశ్రయిస్తాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సరళిపై తమకు అనుమానాలున్నాయని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని బిఎస్ పి ఆరోపిస్తోంది. ఈ విషయమై రానున్న రెండు రోజుల్లో కోర్టుకు వెళ్ళనున్నట్టు ఆ పార్టీ చీఫ్ మాయావతి ప్రకటించింది.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎన్నికల ఫలితాలపై బిఎస్ పి చీఫ్ మాయావతి అనుమానాలను వ్యక్తం చేశారు. ఈవీఎంలను బిజెపి ట్యాంపరింగ్ చేసిందని ఆ పార్టీ ఆరోపణలు గుప్పించింది.

bsp chief mayawati to move court next 2 days

ఈవీఎంలను బిజెపి ట్యాంపరింగ్ చేసిందని బిఎస్పీ ఆరోపిస్తోంది. ఈ మేరకు కోర్టును ఆశ్రయించాలని బిఎస్పీ భావిస్తోంది.సోమవారం నాడు ఆమె పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

కోర్టులో తనకు న్యాయం జరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదన్నారు. గతంలోనే ఎన్నికల కమిషన్ మాయావతికి స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 400 స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 19 స్థానాలను మాత్రమే బిఎస్పీ గెలుచుకొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
bsp chief mayawati will move court in the next two or three days against alleged tampering of evm's.
Please Wait while comments are loading...