ప్రేమకోసం: దొంగతనం కొత్తగా ఉందని ట్రై చేశాడు...అడ్డంగా దొరికాడు
ఢిల్లీ: నిత్యం నేరాలు జరుగుతూనే ఉంటాయి. నేరాల్లో భాగమే దొంగతనాలు కూడా. ఈ దొంగతనాల్లో కూడా కేటుగాళ్లు కొత్త పద్ధతులను కనిపెడుతున్నారు. దొంగతనంలో ఒక పద్ధతి వర్కౌట్ కాకపోతే మరో పద్ధతి... అదీ... కాకపోతే ఇంకో పద్ధతి. దొంగలించే పద్ధతి ఏమైనా ఎలాంటిదైనా... మొత్తానికి అనుకున్నది సాధిస్తున్నారు చార్ సౌ బీస్ గాళ్లు. ఇలాంటి కొత్త పద్ధతి దొంగతనమే ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఇదిగో ఫోటోలో కనిపిస్తున్న ఇతగాడు ఓ అమ్మాయి మనస్సు దొంగలించడమే కాదు... తన ప్రియురాలి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఓ కాస్లీ గిఫ్ట్ ఇచ్చేందుకు ఇలా కొత్త పద్ధతిలో దొంగతనం కూడా చేశాడు. ఇంతకీ ఈ యువదొంగ పేరేంటో తెలుసా..వైభవ్ ఖురానా. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఢిల్లీలో ఓ హోటల్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఎంతైనా ఇంజనీరింగ్ చేశాడు కదా... మనోడికి టెక్నాలజీపై బాగా పట్టున్నట్లు ఉంది. ఆ టెక్నాలజీనే దొంగతనానికి వాడుకున్నాడు. ఇక అసలు విషయానికొచ్చేద్దాం.

ఢిల్లీ మోడల్ టౌన్‌లో నివసించే వైభవ్ ఖురానా తన ప్రియురాలికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు. అయితే అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో... ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్ నుంచి రూ.67వేలు విలువ చేసే వాచ్ ఆర్డర్ ఇచ్చాడు. అడ్రస్ మాత్రం కరెక్ట్‌గా ఇవ్వలేదు. ఇక డెలివరీ బాయ్ కలిపాడ సాహు ఆ వాచ్ తీసుకుని వైభవ్‌కు ఫోన్ చేశాడు. తను కశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నానని అక్కడికి రమ్మని చెప్పాడు. డెలివరీ బాయ్ సాహూ అక్కడికి వెళ్లి వైభవ్‌ను కలిశాడు. వైభవ్ తన ఇంట్లో డబ్బులు ఉన్నాయని అక్కడికి వెళదామని చెప్పి డెలివరి బాయ్ బైకులోనే ఇద్దరూ వెళ్లారు. అయితే తప్పు అడ్రస్‌కు వైభవ్ తీసుకెళ్లాడు. ఇక బైక్ పార్క్ చేసేందుకు పార్శిల్‌ను పక్కనబెట్టాడు సాహూ. ఇదే అదునుగా భావించి ఆ పార్శిల్ తీసుకుని బైకుపై ఉడాయించాడు వైభవ్.
సాహూ వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన పోలీసులు ముందుగా వైభవ్ ఫోన్ నంబరుపై ఉన్న అడ్రస్‌కు వెళ్లాడు. అయితే అక్కడున్న వ్యక్తి ఇది తన నంబరు కాదని చెప్పాడు. వెంటనే ఎక్కువ సార్లు ఉన్న నంబరును తీసుకుని విచారణగా చేయగా... ఆ నంబరు వైభవ్ ప్రియురాలిదిగా తేలింది. అది తన బాయ్ ఫ్రెండ్ వైభవ్ నంబర్ అని చెప్పడంతో పోలీసులు అతని అడ్రస్ కనుకున్నారు. ఇంటికెళ్లి చూడగా వైభవ్ అక్కడే ఉన్నాడు. అతనిని అరెస్టు చేసి చివరకు వాచ్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications