కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తపాలా కార్యాలయాలు : నిర్మల సీతారామన్
దేశంలోని తపాలా కార్యాలయాలు ఇక బ్యాంకింగ్ తరహాలో సేవలు అందించనున్నాయి. ఈమేరకు తపాలా కార్యాలయాలను కోర్ బ్యాంకింగ్ సిస్టిమ్‌లోకి తీసుకువస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2022-23 బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తపాలా కార్యాలయాలు ఆర్థిక సమ్మెళితత్వంలో భాగస్వాములవుతాయని చెప్పారు. ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట లభించే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. విశ్వాసమైన పరిపాలన కోసం కేంద్రం పనిచేస్తున్న చేస్తున్నట్లు తెలిపారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0
తపాలా కార్యాలయాలను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి తీసుకు రావడంతో గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 ప్రారంభమవుతుందన్నారు. నగరాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందనన్నారు. టైర్ 2, టైర్ 3 నగరాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా హై లెవల్ అర్భన్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

పర్యావరణ హితంగా ప్రజా రవాణ
దేశంలోని 75 జిల్లాలో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించనున్నట్లు లోక్ సభలో నిర్మల సీతారామన్ తెలిపారు. నగారాల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. దేశంలోని సగం జనాభా 2047 నాటికి నగరాల్లోనే ఉంటారని పేర్కొన్నారు. ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మార్చడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఈ-వెహికల్స్ కోసం బ్యాటరీ స్వాపింగ్ పాలసీని తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వావానాల మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications