Budget 2023: జాతీయ అప్రెంటీస్ స్కీమ్- మూడేళ్లలో 47 లక్షల మంది యూత్ కు స్టైఫండ్..

కేంద్రం వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి అమలు చేయబోతున్న జాతీయ అప్రెంటిస్ షిప్ పథకం మూడేళ్లలో 47 లక్షల మంది యువతకు ఆర్ధికంగా ప్రయోజనకారి కాబోతోంది.

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రకటించిన బడ్జెట్ లో యువత కోసం ఉద్దేశించిన ఓ కీలక పథకం కూడా ఉంది. ఇందులో సాంకేతిక విద్యాకోర్సులు పూర్తి చేసిన తర్వాత యువతకు అప్రెంటీస్ షిప్ లో స్టయిఫండ్ లభించబోతోంది. జాతీయ స్ధాయిలో ప్రవేశపెట్టే ఈ పథకం ద్వారా మూడేళ్లలో 47 లక్షల మంది యువతకు స్టయిఫండ్ లభించబోతోందని కేంద్రమంత్రి నిర్మల తన ప్రసంగంలో తెలిపారు. దీంతో అప్రెంటీస్ షిప్ చేసే యువతకు ప్రయోజనం కలగబోతోంది.

అలాగే ఈ స్టయిఫండ్ మొత్తం కూడా అప్రెంటీస్ చేసే వారి ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ రూపంలో ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే విషయాన్ని నిర్మల తన ప్రసంగంలో వెల్లడించారు. మరోవైపు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 30 స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించిట్లు నిర్మల ప్రకటించారు. దీంతో పాటు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఐఓటీ, రోబోటిక్స్ తదితర కోర్సులను కూడా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు.

Budget 2023: centres new apprenticeship scheme to benefit 47 lakh youth in 3 years

వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో యువతకు భారీగా ప్రయోజనం కలిగేలా కేంద్రం ఈసారి బడ్జెట్ లో ఉద్యోగాల కల్పనతో పాటు యువతకు ఉపాధికి ప్రోత్సాహం కల్పించే చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ స్కిల్ కేంద్రాలతో పాటు జాతీయ అప్రెంటిస్ షిప్ పథకం ద్వారా స్టయిఫండ్ నేరుగా బదిలీ కార్యక్రమం చేపడుతోంది.
ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డీబీటీ) ద్వారా కేంద్రం నగదు బదిలీ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+