Budget 2026: ఏపీ, తెలంగాణకు నిర్మలా సీతారామన్ శుభవార్త- ప్రతీ జిల్లాలో ఇక..!!
కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రతిపాదించారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మతా సీతారామన్ ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, తమిళనాడుకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల కారిడార్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అదే విధంగా దేశంలో 7 హైస్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక.. ప్రతీ జిల్లా కేంద్రంగా కొత్త నిర్ణయం వెల్లడించారు.
నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి జిల్లాలో బాలిక ల వసతి గృహం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆతిథ్యరంగంలో జాతీయ సంస్థ ఏర్పాటు పైనా స్పష్టత ఇచ్చారు. సూక్ష్మతరహా పరిశ్రమలకు రూ.2వేల కోట్లు కేటాయించారు. స్వయం సమృద్ధ భారతం పేరుతో రూ.2వేల కోట్ల ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఎంఎస్‌ఎంఈలకు చేయూత ఇస్తామని ప్రకటించారు. అదే విధంగా విదేశాల్లో ఉంటున్న భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పారు.

భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. మూలధన వ్యయం రూ.12.2లక్షల కోట్లకు పెంపుగా ప్రతిపాదించారు. లక్షల జనాభా దాటిన నగరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు, విద్య, వైద్య పరిశోధనలు సంస్థల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
కీలక ప్రతిపాదనలు
ఇక, దేశంలో మధుమేహం, క్యాన్సర్ సహా పలు అసంక్రమిత వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్నట్లు గమనించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వారికి దీర్ఘాయువు, నాణ్యమైన జీవితాన్ని అందించడంలో జీవసంబంధమైన మందులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అందుకే భారత్‌ను ప్రపంచ బయో-ఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి, రాబోయే ఐదు సంవత్సరాలలో 10,000 కోట్ల రూపాయల వ్యయంతో 'బయో-ఫార్మా శక్తి' పథకాన్ని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి, వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రం.. ఫిస్కల్ డిసిప్లిన్‌ను సాధించామని చెప్పారు. ఉపాధి కల్పనకు సమగ్ర సంస్కరణలను తీసుకొచ్చామని చెప్పారు. సెమీ కండక్టర్ మిషన్ 2.0 కోసం రూ. 40 వేల కోట్లు కేటాయింపులు ప్రతిపాదించారు. రెండు హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటుతో పాటుగా MSMEలకు క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. విలువైన ఖనిజాల తవ్వకాల కోసం కొత్త స్కీమ్ అమలు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications