జైలు ఖైదీలకు భార్యలతో గడిపే బంపర్ ఆఫర్; దేశంలోనే తొలిసారి.. అమలు అక్కడే!!
వివిధ నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కోసం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది పంజాబ్ ప్రభుత్వం. దేశంలోనే తొలిసారిగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు తమ జీవిత భాగస్వామితో జైలు ఏకాంతంగా గడిపే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు దాంపత్య జీవనం.. పంజాబ్ జైళ్ళ శాఖ నిర్ణయం
తమ రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీల కోసం పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంలో భాగంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు దాంపత్య జీవితాన్ని జైలు గోడల మధ్యే అందించనుంది. జీవిత భాగస్వాముల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జైళ్ల శాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గోఇంద్ వాల్ సాహెబ్ కేంద్ర కారాగారం, నాభా జిల్లా జైలు, బఠిండా మహిళా జైలులో దీనిని లాంఛనంగా ప్రారంభించినట్లు తెలిపిన అధికారులు ఇప్పుడు 17 జైళ్లలో దీనిని అమలు చేయనున్నారు.

భార్యలతో ములాఖత్ కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేక గది ఏర్పాటు
ఈ పథకంలో భాగంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు తన భార్యతో గడిపే అవకాశాన్ని మూడు నెలలకోసారి రెండు గంటల చొప్పున ఇవ్వనున్నారు. ఈ సమయంలో వారి భార్యలతో దాంపత్య సుఖాన్ని కూడా అనుభవించవచ్చని జైలు అధికారులు తెలిపారు. భార్యతో వీరు ములాఖత్ కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేక గదిని కేటాయిస్తున్నారు. ఇక ఆ సమయంలో వీరికి కావలసిన మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు, కుటుంబ జీవనంలో కలిసి పోవడం కోసం పంజాబ్ జైళ్ల శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

కుటుంబ బంధాలను పటిష్టం చెయ్యటం కోసం ఈ నిర్ణయం తీసుకున్న పంజాబ్ సర్కార్
దేశంలోని వివిధ జైళ్ళలో ఐదున్నర లక్షల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. ఇక ఖైదీల సంఖ్య ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఖైదీల మార్పు తీసుకురావడం కోసం, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు సాధారణ కుటుంబ జీవితానికి అలవాటు చేయడం కోసం పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం సత్ఫలితాలనిస్తుంది. కుటుంబ బంధాలను పటిష్టం చేయడంలో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకం, ఖైదీలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని జైలు అధికారులు చెబుతున్నారు. అంతకు ముందు అంత దిగాలుగా ఉన్న అనేక మంది ఖైదీలు, భార్యలతో ఏకాంతంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తర్వాత ఉత్సాహంగా కనిపించారు అని చెబుతున్నారు.

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఈ అవకాశం
తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి, గ్యాంగ్ స్టర్ లకు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఈ అవకాశం ఉండదని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా జైల్లో గడుపుతూ, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మూడు నెలలకు ఒకసారి భార్యతో ఏకాంతంగా గడిపే అవకాశం కల్పిస్తున్నట్లు, అందుకోసం వారికి అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ప్రత్యేక గదిని కేటాయిస్తున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా పంజాబ్ రాష్ట్రంలో ప్రారంభించిన ఈ సరికొత్త పథకం ఖైదీల ప్రవర్తనలో ఒక మంచి మార్పును తీసుకు రాగలిగితే తమ ప్రయత్నం ఫలించినట్టే అని చెబుతోంది పంజాబ్ జైళ్ల శాఖ.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications