బుర్కాలు వేసుకున్న ఉగ్రవాదులు అరెస్టు, టార్గెట్
శ్రీనగర్: బుర్కాలు వేసుకుని దాడులు చెయ్యడానికి ప్లాన్ లు వెయ్యడానికి వెళుతున్న ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నామని, వీరితో పాటు ఎవరైనా వచ్చారా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15వ తేదిన జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు సోదాలు చేస్తున్నారు. సరిహద్దులలో గస్తి ముమ్మరం చేశారు.
బుధవారం ఇద్దరు బుర్కాలు వేసుకుని అనుమానాస్పదంగా సంచరిస్తున్న విషయం గుర్తించిన పోలీసులు వారి మీద నిఘా వేశారు. ఇద్దరు బుర్కాలతో పాటు మహిళలు వేసుకునే హై హీల్ స్యాండిల్స్ (చెప్పులు) వేసుకున్న విషయం గుర్తించారు.

తరువాత ఇద్దరిని పట్టుకుని పరిశీలించాగా వారు మహిళలు కాదని పురుషులు అని వెలుగు చూసిందని పోలీసు అధికారులు చెప్పారు. అబ్దుల్ కరీం, జమాల్ దిన్ అనే ఇద్దరు ఉగ్రవాదులను కాశ్మీర్ లోని చౌగాన్ గ్రౌండ్స్ సమీపంలో పోలీసు అధికారులు అరెస్టు చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా వీరు జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసాలు సృష్టించడానికి ప్లాన్ వేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ముందు జాగ్రత చర్యగా జమ్మూ కాశ్మీర్ లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి గస్తి ముమ్మరం చేశారు. దర్యాప్తు జరుగుతున్నందు వలన అరెస్టు అయిన ఇద్దరు ఏ ప్రాంతానికి చెందిన వారు అని అధికారులు వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications