ఉపఎన్నికల్లో బీజేపీకి షాక్: 4 స్థానాల్లో ఓటమి, బెంగాల్లో టీఎంసీ, బీహార్‌లో ఆర్జేడీ, ‘మమత గేమ్‌ఛేంజర్’

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల పరిధిలో జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో ఒక్క చోట మినహా అన్ని చోట్లా అధికార పార్టీలకే ఓటర్లు పట్టం కట్టారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే ప్రతిపక్ష ఆర్జేడీ అభ్యర్థి అభ్యర్థి గెలుపొందారు. కాగా, పోటీ చేసిన అన్నిచోట్లా బీజేపీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ స్వీప్.. మమత గేమ్‌ఛేంజర్

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ స్వీప్.. మమత గేమ్‌ఛేంజర్

అందరి దృష్టిని ఆకర్షించిన పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండు స్థానాల్లోనూ విజయం సాధించింది. అసోన్సోల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి శతృఘ్ను సిన్హా, తన సమీప బీజేపీ అభ్యర్ధి అగ్నిమిత్రాపై 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. బల్లిగంజ్ అసెంబ్లీ స్థానంలోనూ తృణమూల్‌ అభ్యర్థి బాబుల్‌ సుప్రియో 22వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బీజేపీ అహంకారానికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని గెలుపు అనంతరం బాబూల్ సుప్రియో వ్యాఖ్యానించారు. టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ నేత కాబోతున్నారని శత్రుఘ్ను సిన్హా అన్నారు.

బీహార్‌లో ఆర్జేడీ, మహారాష్ట్రలో ఎంవీఏ అభ్యర్థుల గెలుపు

బీహార్‌లో ఆర్జేడీ, మహారాష్ట్రలో ఎంవీఏ అభ్యర్థుల గెలుపు

ఇక బీహార్ రాష్ట్రంలోని బొచహాన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్రీయ జనతా దళ్‌(RJD) అభ్యర్థి అమర్‌కుమార్‌ పాసవాన్‌.. తన సమీప బీజేపీ అభ్యర్థి బేబీ కుమారిపై 35 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ నార్త్‌ అసెంబ్లీ స్థానంలో అధికార మహావికాస్‌ అఘాడి అభ్యర్థి జయశ్రీ జాదవ్‌.. బీజేపీ అభ్యర్థి సత్యజీత్‌ కదమ్‌పై 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఛత్తీస్‌ఘఢ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

ఛత్తీస్‌ఘఢ్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోని కైరాగర్‌ శాసనసభ స్థానంలో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి యశోదా వర్మ.. బీజేపీ అభ్యర్థి కోమల్ జంగేల్‌పై 20 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా, మహారాష్ట్రలో ఉపఎన్నికలో తమ కూటమి అభ్యర్థి గెలుపొందడంపై శిసేన పార్టీ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. బీజేపీపై మండిపడ్డారు. వివాదాలతో గెలవాలని చూసిన బీజేపీకి ప్రజలు తమ తీర్పుతో జవాబిచ్చారన్నారు. ఉపఎన్నికల్లో ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+