శశికళను వదిలిపెట్టని జయలలిత!: రూ.20 తీసుకున్నారని ఫిర్యాదు
చెన్నై: డిఎంకే ఎంపీ తిరుచ్చి శివ పైన చేయి చేసుకొని, ఆ తర్వాత అమ్మ జయలలిత ఆగ్రహానికి గురై, అన్నాడీఎంకే పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకి మరో చిక్కు వచ్చి పడింది. ఆమెను అన్నాడీఎంకే వదిలి పెట్టడం లేదు.
నా భార్యది డ్రామా, జయలలిత వైపే: ఎంపీని కొట్టిన శశికళకు భర్త షాక్అన్నాడీఎంకేకు చెందిన ఓ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన తమిళనాడు పోలీసులు శశికళపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణను ప్రారంభించారు.
తమిళనాడులోని తిరునల్వేలి పరిధిలోని పాళయంకోట శాంతినగర్‌కు చెందిన అన్నాడీఎంకే నేత రాజేశ్ జాతీయ రహదారికి ఇరువైపులా చెట్లకు నీరు పోసే కాంట్రాక్టును దక్కించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయన తన పార్టీ ఎంపీగా ఉన్న శశికళ సిఫారసు కోసం యత్నించారు.

అయితే రూ.25 లక్షలిస్తేనే ఆ కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ శశికళ చెప్పారని, బేరసారాల తర్వాత రూ.20 లక్షలకు ఒప్పుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో రాజేశ్ రెండు విడతలుగా రూ.20 లక్షలను శశికళకు ఇచ్చారని అంటున్నారు.
డబ్బులు తీసుకున్న శశికళ.. కాంట్రాక్టును మాత్రం ఆయనకు ఇప్పించలేదంటున్నారు. దీంతో తన వద్ద డబ్బు తీసుకుని శశికళ తనను మోసగించారని రాజేశ్ తిరునల్వేలి పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ఫిర్యాదు చేసిన వ్యక్తి ట్రావెల్స్ ఆపరేటర్ కూడా. అతను ఓ క్యాబ్ సంస్థను నడిపిస్తున్నారు.
డీఎంకే ఎంపీ చెంప చెల్లు: జయలలిత కుక్కలా చూశారని, ఏడ్చిన శశికళఇదిలా ఉండగా, శశికళ పుష్ప రెండు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు గడప తొక్కారు. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తనకు తగిన పోలీస్ రక్షణ కావాలని ఆమె హైకోర్టును కోరారు. తనకు బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయని ఆమె చెప్పారు.
డిఎంకే ఎంపీ తిరుచ్చి శివ పైన చేయి చేసుకొని, ఆ తర్వాత అమ్మ జయలలిత ఆగ్రహానికి గురై, అన్నాడీఎంకే పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకి మరో చిక్కు వచ్చి పడింది. ఆమెను అన్నాడీఎంకే వదిలి పెట్టడం లేదు.












Click it and Unblock the Notifications