8న భారత్ బంద్: పాత చట్టాలతో నవశకం సాధ్యం కాదంటూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

లక్నో: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం అభివృద్ధి చెందడం కోసం సంస్కరణలు చేపట్టడం ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

దేశ అభివృద్ధికి సంస్కరణలు అవసరం..

దేశ అభివృద్ధికి సంస్కరణలు అవసరం..

ఓ వైపు ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంగళవారం నిర్వహించిన ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్టు వర్చువల్ ప్రారంభ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. దేశంలో కొత్త చట్టాలు తెచ్చి అభివృద్ధి చేసేందుకు సంస్కరణలు ఎంతో అవసరమని అన్నారు.

కొత్త చట్టాలతోనే నవశకం..

కొత్త చట్టాలతోనే నవశకం..

గత శతాబ్ధంలో తయారు చేసిన చట్టాలతో మనం నవ శకాన్ని నిర్మించలేమని ప్రధాని వ్యాఖ్యానించారు. గత శతాబ్ధంలో మంచిగా ఉపయోగపడిన చట్టాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో భాగంగా మారాయన్నారు. కాబట్టి సంస్కరణలు చేపట్టడం ఎంతో ఆవశ్యకమని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం పూర్తిగా సంస్కరణలను ప్రోత్సహిస్తోందని ప్రధాని చెప్పారు.

ప్రజాతీర్పులే నిదర్శనం..

ప్రజాతీర్పులే నిదర్శనం..

ఇటీవల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయని, అందుకు తాజాగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అదే విధంగా దేశంలో రూ. 100 లక్షల కోట్లతో దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టు చేపట్టనున్నట్లు మోడీ తెలిపారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రభుత్వం మొదలుపెట్టినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఇక, గతంలో సంస్కరణలు కొన్ని రంగాలకే పరిమితం అయ్యావి, కానీ, తమ సర్కారు మాత్రం అన్ని రంగాల్లో సంస్కరణలను విస్తరించినట్లు వివరించారు.

రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు...

రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు...

మరోవైపు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయన్నారు. తొలుత వ్యవసాయ బిల్లులోని నిబంధనలకు మద్దతు తెలిపిన పార్టీలు ఇప్పుడు వ్యతిరేకించడమేంటని ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వ్యవసాయ రంగంలో కేంద్రం చేపట్టిన సంస్కరణలపై రైతుల్లో నెలకొన్న అపోహల్ని వివరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. కానీ, కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+