'వివాహానికి, సహజీవనానికి తేడా ఉంది, అత్యాచార పరిధి నుంచి వేరు చేయలేం', 2 నెలల్లో 300

న్యూఢిల్లీ: అత్యాచార పరిధి నుంచి సహజీవన సంబంధాన్ని వేరు చేయలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇండియన్ పీనల్ కోడ్ పరిధి నుంచి సహజీవన సంబంధాన్ని వేరు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై కోర్టు ఆ విధంగా స్పందించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి, జస్టిస్ రాజీవ్ సహాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై స్పందిస్తూ అత్యాచార పరిధి నుంచి తప్పిస్తే సహజీవనం చేస్తున్నవారికి వైవాహిక హోదా పొందినట్లవుతుందని పేర్కొంది. వివాహానికి, సహజీవన సంబంధానికి చేలా వైరుధ్యం ఉందని పేర్కొంది. ఈ పిటిషన్‌కు విచారణ యోగ్యత లేదని పేర్కొంటూ తిరస్కరించింది.

2 నెలల్లో 300 అత్యాచారాలు, 500 లైంగిక వేధింపులు:

Can't keep live-in relations outside purview of rape: HC

దేశ రాజధానిలో నిర్భయ అత్యాచారం జరిగిన తర్వాత మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకువచ్చింది. కానీ న్యూఢిల్లీలో మాత్రం మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఇందుకు ఉదాహరణ గడిచిన రెండు నెలల్లో 300 అత్యాచారాలు, 500 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.

ఈ వివరాలను సాక్షాత్తూ ఢిల్లీ పోలిస్ కమిషనర్ బీఎస్ బస్సీ ఆదివారం వెల్లడించారు. ఢిల్లీలోని వివిధ పోలీసు స్టేషన్లలో ఈ అత్యాచారాలపై ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు ఆయన తెలిపారు. 2013 కంటే కొంత తక్కువగా ఉన్నా, 2014 ఏడాది మొదటి రెండు నెలల్లో ఇదే సంఖ్యలో అత్యాచారాలు జరిగాయని ఆయన వెల్లడించారు.

అత్యాచారం జరిగిన అన్ని కేసుల్లో దాదాపు 96 శాతం మంది బాధితురాలు బంధువులు, స్నేహితులు నిందితులుగా ఉన్నారని.... మిగిలిన 4 శాతం మాత్రం వేరే వారు ఉంటున్నట్లు బస్సీ చెప్పారు. ఈ ఏడాది మార్చి 8 వరకు 26వేల మంది బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణ పొందారని బస్సీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+