చంపేశారు: అహ్మదాబాద్ యువకుల పైశాచికం(వీడియో)
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన కొందరు యువకులు తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఆ ఎనిమిది మంది దుర్మార్గులు ఓ వృద్ధుడ్ని దారుణంగా కొట్టి చంపారు.
వివరాల్లోకి వెళితే.. ఓ పాన్ డబ్బా దగ్గరకు వెళ్లి అక్కడ తమకు కావాల్సిన వస్తువులు తీసుకున్నారు ఆ ఎనిమిది యువకులు. ఆ తర్వాత తీసుకున్న వస్తువులకు డబ్బులు అడిగినందుకు పాన్ డబ్బా యజమానిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు.
అనంతరం అతడ్ని ఆ దుర్మార్గులు కర్రలతో తీవ్రంగా కొట్టారు. వారి దెబ్బలకు తాళలేని బాధితుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన జరిగింది నడిరోడ్డుపైనే. అక్కడ ప్రాణాలున్న చాలా మంది సంచరిస్తున్నారు.

కానీ, వారిలో మానవత్వమే లేనట్లుగా ఇటువైపు చూడకుండానే వెళ్లిపోయారే తప్ప.. అతడి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. సెప్టెంబర్ 1న జరిగిన ఈ దారుణ ఘటన మొత్తం సిసి కెమెరాల్లో రికార్డయింది.
కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రధాని నిందితుడితోపాటు మరో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications