కావేరి రచ్చ: కర్ణాటక, తమిళనాడు చెవ్వు పిండిన సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో ప్రజల ఆస్తులకు హానికలగకుండ వాటిని కాపాడటం ఆయా రాష్ట్రాల భాద్యత అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రజల ఆస్తులకు నష్టం జరుగుతున్నా ఎందుకు మీరు నిర్లక్షం చేస్తున్నారని కర్ణాటక, తమిళనాడుల చెవులుపిండింది.
కర్ణాటక, తమిళనాడులో శాంతిభద్రతలు కాపాడటానికి సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని కన్యాకుమారి అనే మహిళ వేసిన అర్జీ విచారణ స్పందర్బంగా సుప్రీం కోర్టు ఆ విధంగా వ్యాఖ్యానించింది.
న్యాయస్థానం ఆదేశాలకు విరుద్దంగా ఆందోళనలు చెయ్యరాదని, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇవ్వారాదని సూచించింది. ఈ అర్జీ విచారణ ఈనెల 20వ తేదికి వాయిదా వేశారు.

ఆ రోజు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు శాంతిభద్రతలు కాపాడటంలో ఎందుకు విఫలం అయ్యారు అని న్యాయస్థానం ముందు చెప్పడానికి సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఆందోళనలను అదుపుచెయ్యడంలో ఎందుకు విఫలం అయ్యాయి అని సుప్రీం కోర్టు వివరణ కోరింది. కావేరీ జలాల పంపిణి విషయంలో న్యాయస్థానం తీర్పుతో రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పాయని కన్యాకుమారి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications