కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్ కు మరోసారి సీబీఐ సమన్లు
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో హీరో దళపతి విజయ్ కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం దిల్లీలో హాజరు కావాలని ఆదేశించింది. ఇక గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో టీవీకే అధ్యక్షుడు విజయ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సభలో విజయ్ ను చూసేందుకు ఫ్యాన్స్, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో విజయ్ కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనలో 41 మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సభలో విజయ్ ను చూసేందుకు ఫ్యాన్స్, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రాస్తోగి నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. టీవీకే పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను విచారించిన సీబీఐ ఈ నెల 12న విజయ్ ను తొలిసారి దిల్లీలో విచారించింది.

ఇక విజయ్ నటించిన చివరి మూవీ 'జన నాయగన్' చిత్రం సెన్సార్ కు నోచుకోకుండా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై తమిళనాట రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై లోక్ సభలో విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఓ ట్వీట్ లో ప్రకటించారు. తమిళ సంస్కృతిపై కేంద్రం దాడి జరుపుతోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications