
సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం: రూ.300 కోట్ల స్కాంకు సంబంధించి విచారణ
జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. గవర్నర్‌గా పనిచేసిన సమయంలో రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ.300 కోట్ల లంచం తీసుకున్నారనే అభియోగాలపై విచారణ చేశారు. మాలిక్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆగస్ట్ 23వ తేదీ 2018 నుంచి అక్టోబర్ 30 209 వరకు ఈ అక్రమాలు జరిగాయనే రుమర్లు వచ్చాయి.
కశ్మీర్ తర్వాత మేఘాలయా గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ పనిచేశారు. అక్కడ గవర్నర్ పదవీ అక్టోబర్ 4వ తేదీన ముగిసింది. ఆ తర్వాత సీబీఐ ఎంక్వైరీ చేసింది. అక్రమాలకు సంబంధించి ఏప్రిల్ నెలలో సీబీఐ కేసులు నమోదు చేసింది. గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీం, సివిల్ వర్క్‌కు సంబంధించి రూ.2200 కోట్లు కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.

2017లో మాలిక్ బీహర్ గవర్నర్‌గా పనిచేశారు. తర్వాత కశ్మీర్‌కు బదిలీపై వచ్చారు. కీలకమైన సమయంలో విధులున నిర్వహించారు. మీరట్ వర్సిటీలో ఉండే సమయంలోనే మాలిక్ విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. 1974లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజ్యసభకు ఎంపీగా గెలుపొందారు. బోఫోర్స్ స్కాం తర్వాత తన పదవీకి రాజీనామా చేశారు. 1988లో మరోసారి ఎంపీగా గెలుపొందారు. 2004లో బీజేపీలో చేరారు. చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ చేతిలో ఓడిపోయారు.