పగలు జ్యోతిష్యం.. రాత్రి అయితే మహిళలతో.. 58 వీడియోలు వైరల్..

మహారాష్ట్రకు చెందిన గాడ్ మ్యాన్ గా పేరుపొందిన నాసిక్ కు చెందిన జ్యోతిష్యుడు, న్యూమరాలజిస్ట్ అశోక్ కారత్ తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే ఇతడికి మహారాష్ట్రలోని రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఇదే విషయంపై అధికార కూటమిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.

అశోక్ కుమార్ కారత్ గతంలో మెర్చంట్ నేవీ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించాడు. పదవీ విరమణ అనంతరం తనకు తాను జ్యోతిష్యుడిగా ప్రకటించుకున్నాడు. అయితే ఆయన తాజాగా ఓ రేప్ కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. ఓ 35 ఏళ్ల మహిళపై నవంబర్ 2022 నుంచి డిసెంబర్ 2025 వరకు లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. గత కొన్నేళ్లుగా అశోక్ కుమార్ కు మహారాష్ట్రలోని ఎంతోమంది రాజకీయ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు సమాచారం.

ఇక అశోక్ కుమార్ కారత్‌ తన వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్ చేస్తూ దోపిడీ చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడ్ని అరెస్టు చేసి 58 అసభ్యకర వీడియోలను సీజ్ చేశారు.ఇతడికి మహారాష్ట్రలోని రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు.

AshokKarat Famous Maharashtra Astrologer Arrested for Sexual Harassment Ashok Karat sexual harass

మరోవైపు శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ ఈ ఘటనను "మహారాష్ట్ర ఎప్‌ స్టీన్ ఫైల్స్" అని అభివర్ణించారు. అధికార పార్టీ నేతలు అతనికి అండగా నిలుస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు అశోక్ కుమార్ కారత్‌ పై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 64 కింద అత్యాచారం కేసు, అలాగే మోసపూరిత పద్ధతుల్లో లైంగిక సంబంధం కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+