చాలెంజ్: దమ్ముంటే జయ మృతి కేసు సీబీఐకి ఇవ్వండి !

మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలోని యజ్ఞవల్య మంటపంలో శనివారం జయలలిత తిథి కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వైష్ణవ సాంప్రధాయం ప్రకారం తిథి కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీరంగపట్టణం/బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై మాకు చాల అనుమానాలు ఉన్నాయని, అమ్మ ఎలా మరణించారు అని ప్రజలకు తెలియాలంటే వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలని జయ సోదరుడు జయవర్దన్ వాసుదేవన్ తో పాటు జయ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలోని యజ్ఞవల్య మంటపంలో శనివారం జయలలిత తిథి కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వైష్ణవ సాంప్రధాయం ప్రకారం తిథి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్బంగా జయలలిత సోదరుడు వాసుదేవన్, ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మా సోదరి (జయలలిత) మృతిపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అన్ని అనుమాలు తొలగిపోవాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు.

CBI: Tamil Nadu former CM Jayalalithaa death Case

జయలలిత మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశామని అన్నారు. చాల మంది అమ్మ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్లారని గుర్తు చేశారు.

జయలలిత మృతి విషయంలో శశికళ (నెచ్చలి శశికళ) మీద మాకు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. అంతే కాకుండా జయలలిత రాసిన వీలునామా ఎందుకు రహస్యంగా పెట్టారని, వెంటనే దానిని బహిరంగంగా ప్రజలకు చూపించాలని వాసుదేవన్ తో పాటు జయలలిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

జయలలిత మరణానికి అనారోగ్యం కారణమా ? వేరే కారణాలు ఉన్నాయా ? అనే అనుమానాలు పూర్తిగా తొలగిపోవాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని జయ సోదరుడు వాసుదేవన్ డిమాండ్ చేశారు.

ఇప్పటికే జయలలిత ఎలా మృతి చెందారు ? అనే పూర్తి వివరాలు వెల్లడించాలని ఓ స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించారని, మా కుటుంబ సభ్యులతో పాటు తమిళనాడు ప్రజలకు అసలు విషయం తెలియాలంటే సీబీఐ దర్యాప్తు పరిష్కారం చిక్కుతుందని వాసుదేవన్ చెప్పారు.

అన్నాడీఎంకే నాయకులకు నిజంగా అమ్మ మీద ప్రేమ ఉంటే సీబీఐ దర్యాప్తు చేయించాలని, ఆ దమ్ము వారికి ఉందా అని వాసుదేవన్ ప్రశ్నించారు. జయలలితను నిజంగా అమ్మగా భావిస్తే సీబీఐతో దర్యాప్తు చేయించాలని జయ కుటుంబ సభ్యులు చాలెంజ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+