Bank: న్యూఇయర్ రోజు మంత్రికి గిఫ్ట్ ఇచ్చిన దొంగలు, బ్యాంకులో రూ. 50 లక్షలు హామ్ ఫట్, సీసీటీవీల్లో !

బెంగళూరు/ధారవాడ: కర్ణాటకలోని ధారవాడాలోని విద్యాకాశి సర్కిల్ లో రాత్రి దొంగలు బ్యాంకులో చోరీకి పాల్పడ్డారు. ధారవాడ కోర్టు సర్కిల్ సమీపంలోని బీరేశ్వర్ కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.25 లక్షల నగదు, రూ 25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ధారవాడ సిటీ విచారణ ప్రారంభించారు.

నూతన సంవత్సరం ఎంజాయ్ చేసిన బ్యాంకు సిబ్బంది సోమవారం ఉదయం బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులోకి వెళ్లిన సిబ్బంది బ్యాంకు లాకర్‌ను పగులగొట్టి చోరీ చేసి పరారయ్యారని గుర్తించి షాక్ అయ్యారు. సినిమా టెక్నిక్ టైపులో బ్యాంకులోని సీసీ టీవీలన్నీ తగులబెట్టారు. బ్యాంకులో చోరీ చేసిన నిందితులు అక్కడ ఎలాంటి క్లూకూడా వదలకుండా పరారయ్యారు. నిత్యం జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో బ్యాంకులో చోరీ చేసి సీసీటీవీలు తగులబెట్టారు.

 CCTVs were burnt in the bank and Thieves who looted 25 lakhs of jewelry and 25 lakhs in cash in Karnataka.

సంఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీస్‌స్టేషన్‌ కేసు నమోదు చేసుకుని, చుట్టుపక్కల దుకాణాల్లోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. గ్యాస్ కట్టర్ ఉపయోగించి దొంగలు బ్యాంకులో చోరీ చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఏసీపీ విజయ్ తల్వార్ ఘటనాస్థలికి చేరుకుని కేసుకు సంబంధించిన వివరాలు బయటకు లాగుతున్నారు.

ముఖ్యంగా పలు కేసుల్లో సీసీటీవీల్లో దొంగలు పట్టుబడటంతో పోలీసులు పలు కేసులను చాకచక్యంగా ట్రేస్ చేశారు. అయితే ఈ బ్యాంకు చోరీ కేసులో దొంగలు సీసీటీవీలను తగులబెట్టి డీవీఆర్ ఎత్తుకెళ్లిపోవడంతో నిందితులు ప్రోఫషనల్స్ అయి ఉంటారని పోలీసు అధికారులు అంటున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మంత్రికి చెందిన కో ఆపరేటివ్ బ్యాంక్ లో రూ. 50 లక్షల విలువైన నగలు, నగదు చోరీ కావడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. మంత్రి ఫ్యామిలీకి దొంగలు న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చారని ప్రత్యర్థి పార్టీకి చెందిన కొందరు జోకులు వేసుకుంటున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+