కోవాగ్జిన్ ఎక్స్‌పైరీ డేట్ ఇదే: తయారు చేసిన తేదీ నుంచి బెస్ట్ బిఫోర్ యూజ్..!

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కోవాగ్జిన్‌కు అనుమతి ఇవ్వట్లేదు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి అవసరమై అనుమతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంజూరు చేయలేదు. మరింత అదనపు సమాచారాన్ని అందజేయాలంటూ భారత్ బయోటెక్‌ను ఆదేశించింది.

 ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా..

ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా..

అదే సమయంలో- ఆస్ట్రేలియా ప్రభుత్వం కోవాగ్జిన్‌ను అధికారికంగా గుర్తించింది. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు తమ దేశానికి రాకపోకలు సాగించవచ్చని ప్రకటించింది. భారతీయులు మాత్రమే కాదు.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఏ దేశానికి చెందిన వారైనా రావచ్చని తెలిపింది. కోవాగ్జిన్‌తో పాటు చైనాకు చెందిన సినోఫామ్ అభివృద్ధి చేసిన కరోనా నిర్మూలన వ్యాక్సిన్‌ను కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.

 ఎక్స్‌పైరీ డేట్ ఇదే..

ఎక్స్‌పైరీ డేట్ ఇదే..

ఇప్పుడు తాజాగా కోవాగ్జిన్- మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ వ్యాక్సిన్ ఎక్స్‌పైరీ తేదీ వెలువడింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని భారత్ బయోటెక్‌కు అందజేసింది. తయారు చేసిన తేదీ నుంచి 12 నెలల్లోగా.. అంటే సంవత్సరం పాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను వేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ యాజమాన్యం ధృవీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

 రెండేళ్ల కోసం అనుమతి కోరినా..

రెండేళ్ల కోసం అనుమతి కోరినా..

నిజానికి- కోవాగ్జిన్ ఎక్స్‌పైరీ తేదీని 24 నెలల పాటు అంటే రెండు సంవత్సరాలుగా నిర్ధారించాలని ఇదివరకు భారత్ బయోటెక్ యాజమాన్యం.. డ్రగ్ కంట్రోలర్ జనరల్‌కు విజ్ఞప్తి చేసింది. దీనికి అవసరమైన క్లినికల్ డేటాను అందజేసింది. రియల్ టైమ్ అడిషనల్ స్టెబిలిటీ డేటాను డ్రగ్ రెగ్యులేటర్‌కు అందజేసింది. ఈ డేటాను సమగ్రంగా పరిశీలించిన తరువాత భారత్ బయోటెక్ యాజమాన్యం కోరిన విధంగా రెండు సంవత్సరాల పాటు మనుగడలో ఉండేలా ఎక్స్‌పైరీ డేట్‌ను నిర్ధారించలేదు.

ప్రస్తుతం ఆరునెలలే..

ప్రస్తుతం ఆరునెలలే..

దాన్ని ఏడాదికి అంటే తయారు చేసిన తేదీ నుంచి 12 నెలల వరకు మాత్రమే మనుగడలో ఉంటుందని తేల్చింది. తాము అందజేసిన అదనపు స్టెబిలిటీ డేటాను పరిశీలించిన తరువాత సీడీఎస్‌సీఓ ఎక్స్‌పైరీ డేట్‌ను నిర్ధారించిందని భారత్ బయోటెక్ వివరించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ఎక్స్‌పైరీ తేదీ ఆరు నెలల వరకు మాత్రమే ఉంటోంది. తాజాగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 12 నెలల వరకు పొడిగించింది. ఇకపై ఈ పొడిగింపు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ఎఫీషియన్సీ ఇదే..

కరోనా వైరస్‌పై కోవాగ్జిన్ 77.8 శాతం సామర్థ్యంతో కోవాగ్జిన్ పని చేస్తుందంటూ ఇదివరకు క్లినికల్ ట్రయల్స్ నిర్ధారణ చేశాయి. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌పై ఇది 65.2 శాతం మేర ప్రభావం చూపుతుందని తేలింది. కోవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు లభిస్తాయని ఆశించినప్పటికీ.. దీనికి విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. మళ్లీ భారత్ బయోటెక్ యాజమాన్యం.. ఈ అదనపు సమాచారాన్ని అందజేయాల్సి ఉంటుంది. దీనిపై నవంబర్ 3వ తేదీన ఈ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ మరోసారి భేటీ అవుతుంది.

 డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి పొందిన వ్యాక్సిన్లు..

డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి పొందిన వ్యాక్సిన్లు..

కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా పరిమితంగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్, రష్యా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూపొందించిన స్పుత్నిక్ వీ, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, చైనా అభివృద్ధి చేసిన సినోఫామ్ టీకాలను వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినియోగిస్తోన్నాయి ఆయా దేశాలన్నీ. భారత్‌లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అత్యధికంగా వినియోగమౌతోంది. స్పుత్నిక్ వీ వాటా పరిమితంగా ఉంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+