కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం : ఎన్‌డిఏ లో మహిళలకు స్థానం, ఇకపై జాతీయ రక్షణలో వీర వనితలు
కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జాతీయ రక్షణ అకాడమీ (NDA) లో మహిళలకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. మహిళల చేరికను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలను ఎన్‌డిఎలో చేర్చుకునేందుకు మంగళవారం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ముగ్గురు సర్వీస్ చీఫ్‌లతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఎంతో కాలంగా ఎన్‌డిఏ లో స్థానం కోసం న్యాయ పోరాటం చేస్తున్న మహిళాలోకం పోరాటం ఫలించింది.
Recommended Video

సైనిక దళాలలో మహిళలకు స్థానం .. సుప్రీం కు చెప్పిన కేంద్రం
ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సైనిక దళాలు దేశంలో చాలా గౌరవప్రదమైన శక్తి అని అందులో మహిళల పాత్ర అవసరమని ,మహిళలు కూడా దళాలలో పని చేసేందుకు సమర్థులని ధర్మాసనం పేర్కొంది. లింగ సమానత్వాన్ని నిర్ధారించడానికి మరింతగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ఈ రోజు పేర్కొంది. అనేక రంగాలలో మహిళలు నిర్వహిస్తున్న ముఖ్యమైన పాత్రను పరిగణలోకి తీసుకొని, రక్షణ దళాలు కూడా మహిళలకు విలువ ఇస్తాయని ఆశిస్తున్నట్లు కోర్టు తెలిపింది.సుప్రీం కోర్టు గత నెలలో మహిళా అభ్యర్థులను ఎన్‌డిఎ ప్రవేశ పరీక్షకు హాజరుకావడానికి అనుమతించిన కొన్ని వారాల తర్వాత కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇటీవల ఎన్‌డిఎ ప్రవేశ పరీక్షకు స్త్రీలను అనుమతించకపోవటంపై సుప్రీం ఆగ్రహం
కోర్టు ఆగస్టు 18 ఉత్తర్వులలో స్త్రీలను పరీక్షకు అనుమతించకపోవడం లింగ వివక్షకు సమానమని పేర్కొంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఎ), సైనిక్ స్కూల్స్ మరియు ఇతర సైనిక సంస్థలలో మహిళా అభ్యర్థులను అనుమతించనందుకుఇండియన్ ఆర్మీ తీరును గతంలోనే సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఎన్డీఏ పరీక్షలో బాలికలకు అవకాశం ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించిన బాలికా అభ్యర్థినులకు అవకాశమివ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసి తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ సమయంలోఇండియన్ ఆర్మీపై విరుచుకుపడింది.

ఇండియన్ ఆర్మీ తీరును తప్పు పట్టిన సుప్రీం
ఎన్డీఏ పరీక్షలలో, సైనిక పాఠశాలలలో,ఇతర మిలటరీ సంస్థలలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇండియన్ ఆర్మీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తమ విధి విధానాల్లో భాగంగా బాలికలకు స్థానం కల్పించడం లేదని సుప్రీం ధర్మాసనం దృష్టికిఇండియన్ ఆర్మీ తీసుకువెళ్ళింది. ఇది ఇండియన్ ఆర్మీ అభివృద్ధి చెందని, తిరోగమనమైండ్ సెట్ కునిదర్శనమని సుప్రీం ధర్మాసనం ఇండియన్ ఆర్మీ తీరు పై మండిపడింది. లింగవివక్షచూపించవద్దని పేర్కొంది. ప్రతిసారి పరీక్షలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడానికి న్యాయ వ్యవస్థ ఎందుకు అవసరం అవుతుంది అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. బాలికలకు కూడా అవకాశం ఇస్తేతప్పేంటని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం, ఇండియన్ ఆర్మీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

బాలికలు ఎన్‌డిఎ ప్రవేశ పరీక్షకు అనుమతి ఇస్తున్నామని చెప్పిన సుప్రీం ధర్మాసనం
మీరు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నారని, బాలికలకు ఎన్డిఎ పరీక్ష రాసే అవకాశం లేకుండా ఆదేశాలు ఇవ్వడం కొనసాగించమని బలవంతం చేస్తున్నారనిపేర్కొన్న సుప్రీం ధర్మాసనం, కోర్టుతమకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుకోవడం కంటేఆర్మీ బాలికలకు స్థానం కల్పించడం , ఆర్మీ లో మహిళలకు కూడా, ప్రాధాన్యత ఇవ్వటం వంటి నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాలికలను ఎన్‌డిఎ పరీక్షకు అనుమతించడానికి మేము అనుమతిస్తున్నామని, దీనిని చాలా తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నామని సుప్రీంకోర్టు అప్పుడు పేర్కొంది.

భారత సైన్యంలో మహిళలకు స్థానం కల్పించాలని సుప్రీం సూచన
మహిళలకు అవకాశాల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్ కంటే ఆర్మీ వెనుకబడిందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. మహిళల విషయంలో భారత నావికాదళం మరియు వైమానిక దళం ఇప్పటికే ఏర్పాట్లు చేసినప్పటికీ, భారత సైన్యం ఇంకా వెనుకబడి ఉందని పేర్కొంది.ఇప్పటివరకు మహిళల ప్రవేశానికి శాశ్వత కమిషన్ ఏర్పాటు చెయ్యలేదని,సుప్రీంకోర్టు మెట్లు ఎక్కే వరకు కూడా మహిళల అంశాన్ని చట్టంలోనూ,ఇతర విభాగాల్లోనూ చేర్చలేదని ఇండియన్ ఆర్మీ పై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.ఇది మార్పులేని మీ మనస్తత్వానికి అద్దం పడుతుందని, ఇండియన్ ఆర్మీ బాలికలపై, మహిళలపై వివక్ష చూపుతున్నట్టు కనిపిస్తుందని కోర్టు ఇండియన్ ఆర్మీ ని తప్పు పట్టింది.కోర్టు ఆదేశాలకు లోబడి అడ్మిషన్లు ఉంటాయని తన తీర్పులో తెలిపింది. ఇక సుప్రీం ఎన్డీఏ పరీక్షలకు అనుమతి ఇస్తూ తీసుకున్న నిర్ణయం నేపధ్యంలో కేంద్రం ఈ వ్యవహారంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.

తాజాగా కేంద్ర నిర్ణయంతో యువతుల్లో జోష్ .. ఇక రక్షణా రంగంలో వీర వనితలు
జస్టిస్ ఎస్ కె కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ అప్పుడు మధ్యంతర ఉత్తర్వును మాత్రమే జారీ చేసింది. పరీక్ష ఫలితాలు కేసుపై తుది తీర్పుకు లోబడి ఉంటాయని పేర్కొంది. ఇక తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా సైనిక దళాల్లో మహిళలకు స్థానం కల్పించనుంది . ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం ధర్మాసనానికి తెలియజేసింది. కేంద్రం తాజా నిర్ణయం మహిళలకు వరంగా మారింది. దీంతో దేశ రక్షణలో మేము సైతం అంటూ మహిళాలోకం జాతీయ రక్షణ అకాడమీ లో చేరి సత్తా చాటనున్నారు. రక్షణా రంగంలో వీర వనితలు చరిత్ర సృష్టించనున్నారు. ఎంతో కాలంగా ఇండియన్ ఆర్మీలో స్థానం కోసం మహిళలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్డీఏ పరీక్షల విషయంలో అనేక మార్లు బాలికలు కోర్టు మెట్లెక్కారు. తమకు ఎందుకు అవకాశం కల్పించటం లేదని న్యాయ పోరాటం చేశారు. ఫైనల్ గా సుప్రీం ధర్మాసనం చొరవతో మహిళలు భారత రక్షణా రంగంలో స్థానం దక్కించుకున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications