వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెడిసిన్లపై క్యూఆర్ కోడ్... నకిలీలకు చెక్ పెట్టేలా కేంద్రం సంచలన నిర్ణయం

|
Google Oneindia TeluguNews

మన జీవన శైలి విధానాల వల్ల, అనేక అనారోగ్య కారణాలతో చాలా మంది ఇబ్బంది పడుతున్న క్రమంలో ఇప్పుడు ప్రతీ ఇంట్లో మందుల వినియోగం అనివార్యంగా మారింది. అయితే మనం వాడుతున్న మందులు మంచివా కాదా? అవి నాణ్యమైనవేనా? నకిలీవా? వంటి అనేక అంశాలు వినియోగదారులకు తెలియవు. వైద్యులు మందులు రాయటం, మనం గుడ్డిగా తెచ్చుకుని వాడటం అలవాటైపోయింది. ఈ క్రమంలోనే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకొని వినియోగదారులు సైతం అసలు మందులు ఏవి? నకిలీ మందులు ఏవి అనేది గుర్తించేలా ఓ నిర్ణయం తీసుకుంది.

షాకింగ్: జమ్మూ కాశ్మీర్ జైళ్ళశాఖ డీజీపీ దారుణహత్య; గొంతుకోసి, తగలబెట్టే యత్నం చేసిన నిందితుడు!!షాకింగ్: జమ్మూ కాశ్మీర్ జైళ్ళశాఖ డీజీపీ దారుణహత్య; గొంతుకోసి, తగలబెట్టే యత్నం చేసిన నిందితుడు!!

 మెడిసిన్స్ పై క్యూఆర్ కోడ్ ముద్రించేలా నిర్ణయం

మెడిసిన్స్ పై క్యూఆర్ కోడ్ ముద్రించేలా నిర్ణయం

అనారోగ్య కారణాలతో మందులు వాడే వారికి నకిలీ మరియు నాసిరకం మందులను గుర్తించేలా కేంద్ర ఒక సంచలన విధానాన్ని తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది. నకిలీ మరియు నాసిరకం మందుల వాడకాన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ట్రాక్ అండ్ ట్రేస్ యంత్రాంగాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. మెడికల్ షాప్ లోకి వెళ్లి మందులు కొనుగోలు చేసే వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న మందులు ప్రామాణికమైన లేదా అనేది తెలుసుకోవడానికి మెడిసిన్స్ పై క్యూఆర్ కోడ్ ముద్రించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది

తొలిదశలో 300 మెడిసిన్ లపై క్యూఆర్ కోడ్ లను ముద్రించటానికి నిర్ణయం

తొలిదశలో 300 మెడిసిన్ లపై క్యూఆర్ కోడ్ లను ముద్రించటానికి నిర్ణయం


ఈ ప్రక్రియలో భాగంగా మొదటి దశలో ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్స్ పై ఫీవర్ కోట్లు ముద్రించబడతాయని పేర్కొంది. ప్రాథమిక ప్యాకేజింగ్ లేబుల్‌లు బాటిల్, డబ్బా, ట్యూబ్ లేదా స్ట్రిప్ వంటి మొదటి-స్థాయి ప్యాకేజింగ్ లు అన్నిటిపై క్యూఆర్ కోడ్ లను ముద్రించనున్నారు. ముందుగా 100 రూపాయల కంటే ఎక్కువ ధర గల 300 మెడిసిన్ లపై ప్రింట్ చేసి, ఆపై క్రమంగా అన్నింటికీ దీనిని తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

బీపీ, షుగర్, నొప్పుల మందులకు ముందుగా క్యూఆర్ కోడ్

బీపీ, షుగర్, నొప్పుల మందులకు ముందుగా క్యూఆర్ కోడ్


మార్కెట్లో కుప్పలుతెప్పలుగా నకిలీ మందులు వస్తున్న క్రమంలో నకిలీ లకు చెక్ పెట్టడానికి, వినియోగదారులు వాడుతున్న మందుల ప్రామాణికత, నాణ్యత వారి నేరుగా చెక్ చేసుకోవడానికి కేంద్రం తీసుకురానున్న ఈ విధానంలో తొలిదశలో నొప్పులకు సంబంధించిన మందులు, హైపర్ టెన్షన్ కు సంబంధించిన మందులు, డయాబెటిస్ కు సంబంధించిన మందులు, గర్భనిరోధక మాత్రలు, విటమిన్లు తదితరాలపై క్యూఆర్ కోడ్ లను ముద్రించనున్నారు.

 త్వరలో పోర్టల్ ప్రారంభించే ప్లాన్ లో కేంద్రం

త్వరలో పోర్టల్ ప్రారంభించే ప్లాన్ లో కేంద్రం


ఈ క్యూఆర్ కోడ్ లను ప్రస్తుత స్మార్ట్ ఫోన్లలో స్కాన్ చేస్తే ప్రోడక్ట్, సర్వీస్ వివరాలు వస్తాయని చెబుతున్నారు. ఇక ఈ క్యూఆర్ కోడ్ తో పాటు, ప్రభుత్వం త్వరలో ఒక పోర్టల్ ను కూడా ప్రారంభించవచ్చు అని తెలుస్తుంది. పోర్టల్ ద్వారా వినియోగదారులు ప్రత్యేక ఐడితో మందుల ప్రామాణికతను తనిఖీ చేసుకోవచ్చని చెబుతున్నారు. క్రమంగా, ఇది ఇతర ఫార్మా ఉత్పత్తులతో పాటు, వైద్య పరికరాలకు విస్తరించే అవకాశం ఉందని సమాచారం.

English summary
Center has taken a sensational decision to print QR code on medicines so that the authenticity of the medicines can be known, fake and perishable medicines can be checked. First, QR codes will be printed on 300 types of medicines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X