ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, నెక్స్ట్ ఇక - తేల్చి చెప్పిన రాజ్ నాధ్..!!
కేంద్రం ఆపరేషన్ సింధూర్ పైన స్పష్టత ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని తేల్చి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ గురించి అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించింది. ఈ ఆపరేషన్ గురించి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన మద్దతును కేంద్రం అఖిల పక్ష నేతలతో పంచు కుంది. ఆపరేసన్ సింధూర్ లో 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు ప్రకటించింది. సరిహద్దుల్లో పరిస్థితులు మారుతున్నాయని.. పాకిస్తాన్ స్పందనకు అనుగుణంగా కఠినంగా స్పందించేందుకు సర్వం సిద్దంగా ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది.
ఆపరేషన్ సింధూర్ గురించి అఖిల పక్ష నేతలకు కేంద్రం వివరించింది. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించింది. అయితే, ఆపరేషన్ పూర్తి కాకుండా భవిష్యత్ కార్యాచరణ వెల్లడించలేమని పేర్కొంది. పాక్ తో పాటుగా పీఓకేలో జరిగిన దాడుల గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ వివరించారు. ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య, తదుపరి పరిణామా లు, దేశ భద్రతా చర్యలను ప్రతిపక్షాలకు వివరించారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి చర్యలకైనా సిద్ధం అని స్పష్టంచేశారు.

దేశం మొత్తం కలిసి కట్టుగా ఉందనే విధంగా నాయకులంతా మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సైన్యాన్ని అభినందించారు.,భద్రతకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది తాము విన్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. దేశభద్రతకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించలేమని రక్షణ మంత్రి తెలిపారని అన్నారు. ఆ విషయాన్ని తాము గౌరవించామని ఖర్గే వెల్లడించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మేము ప్రభుత్వం వెంట ఉన్నామని చెప్పామని.. తెలిపారు.












Click it and Unblock the Notifications