కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్..ఎకరాకు రూ.లక్ష ఆదాయం!
సోలార్ పంప్ సెట్లను బ్యాంకు రుణం ద్వారా పొందాలి. దాన్నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును పవర్ డిస్ట్రిబ్యూషన్ కు విక్రయించాల్సి ఉంటుంది.
Farmers భారత ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తోంది. వీటిల్లో రైతులకు ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి. వాటిద్వారా రైతులు ఎకరాకు రూ.లక్ష వరకు ఆదాయం అందేవి కూడా ఉన్నాయి. వాటిగురించి తెలుసుకుందాం..
central Government Schemes కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల ద్వారా కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. ఆడ పిల్లల దగ్గరి నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు భారత ప్రభుత్వం అందరికీ ఉపయోగపడేలా పలు రకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. అదే కోవలో రైతులకు కూడా మంచి మంచి పథకాలు అమలవుతున్నాయి. వాటిల్లో ఒకటైన పీఎం కుసుమ్ యోజన గురించి తెలుసుకుందాం. ఇందులో చేరడంద్వారా మంచి ఆదాయం పొందొచ్చు. ఎకరానికి రూ.లక్షవరకు అవకాశం ఉంది. ఈ స్కీమ్ కింద సోలార్ పంపులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2019లో ఈ పథకం ప్రారంభమైంది. తర్వాత దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు. దీనివల్ల రైతులు ఎలాంటి దిగులు లేకుండా 25 ఏళ్ల పాటు ఆదాయం పొందొచ్చు.

రైతులు వారి పొలంలో సోలార్ పంపులను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. తక్కువ ఖర్చుతో సోలార్ ఎనర్జీ ద్వారా పంటలు సాగు చేసుకోవచ్చు. రాయితీపై సోలార్ ప్యానెల్స్ అందిస్తారు. దీనిద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. దీని విక్రయించడంద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. సోలార్ ఎనర్జీ వల్ల కరెంటు వినియోగం తగ్గుతుంది. డీజిల్ వాడాల్సిన అవసరం లేదు. దీనిద్వారా కూడా డబ్బులు ఆదా అవుతాయి. ఎక్కడైతే సోలార్ ప్యానెన్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలని భావిస్తున్నారో ఆ స్థలం పవర్ సబ్ స్టేషన్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తును వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవాలి.
తర్వాత అదనపు విద్యుత్తును పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి విక్రయించుకోవచ్చు. 25 సంవత్సరాలపాటు ఇలా చేయడానికి కేంద్రం అవకాశం కల్పించింది. ఏడాదికి ఒక ఎకరంపై రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు లభిస్తాయి. ఈ పథకంలో చేరేవారికి ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. అది 60 శాతంగా ఉంది. అంతేకాకుండా మరో 30 శాతం మొత్తాన్ని బ్యాంకు లోన్ నుంచి తీసుకోవచ్చు. దీనివల్ల చేతి నుంచి మనకు ఎక్కువ నగదు పడదు. వెంటనే https://www.india.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తిచేయాలి. ఆధార్ నెంబర్, భూమికి సంబంధించి డాక్యుమెంట్లు, డిక్లరేషన్ ఫామ్, బ్యాంక్ ఖాతా నెంబరు, ఇతర వివరాలను అందించాలి.












Click it and Unblock the Notifications