రైల్వే నుంచి రైల్వే మెయిల్ సర్వీస్ ను డీలింక్ చేసిన కేంద్రం
ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు(ఐపీపీబీ) ప్రవేశపెట్టడం ద్వారా చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని కార్పొరేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ తపాలాశాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఐపీపీబీని 2018లో ప్రవేశపెట్టింది. తపాలాశాఖ కింద ప్రవేశపెట్టిన మొట్టమొదటి కార్పొరేట్ సంస్థ ఇది. దేశవ్యాప్తంగా 650 ఐపీపీబీ శాఖలు, 2,250 యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేశారు. తపాలాశాఖకు చెందిన ప్రధాన విధులు మాత్రమే డిపార్ట్‌మెంట్ దగ్గర ఉంటాయని, బ్యాంకింగ్, బీమా విధులను ఐపీపీబీలో విలీనం చేయాలని కేంద్రం ఈ ఏడాది ప్రారంభంలో ప్రతిపాదించగా తపాలాశాఖ ఉద్యోగులు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
తపాలాశాఖకు చెందిన బ్యాంకింగ్, బీమా విధుల విలీనంపై ఆగస్టు 15వ తేదీన కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. తపాలాశాఖలో ప్రజలు దాచుకున్న సొమ్ముపై కార్పొరేట్లకు ఉన్న పట్టును ఇవి చట్టబద్ధం చేస్తాయనే అభిప్రాయం వెల్లడవుతోంది. ప్రజల సొమ్ముకు సంబంధించి భద్రత కూడా ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తపాలాశాఖ తన బ్యాంకింగ్, బీమా విధులను నిర్వర్తించే పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకు(పీఎస్‌వోబీ)లో దాదాపు 30 కోట్ల ఖాతాలు ఉన్నాయి. అందులో దాదాపు 10 లక్షల కోట్ల మేర బ్యాలెన్స్ ఉందంటూ ది హిందూ పేర్కొంది.

రైల్వేశాఖ నుంచి రైల్వే మెయిల్ సర్వీసు(ఆర్‌ఎంఎస్)ను డీలింకింగ్ చేయడంపై కూడా తపాలాశాఖ ఉద్యోగుల్లో కొత్తగా ఆందోళన ప్రారంభమైంది. వేగవంతమైన డెలివరీకి రైల్వేను వినియోగించుకొనేందుకు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకు వచ్చింది. మోడీ సర్కార్ కార్పొరేటీకరణ గొడ్డలి ఇప్పుడు
తపాలా విభాగంతోపాటు, ఆర్‌ఎంఎస్‌పై పడిందని ఎంప్లాయీస్ యూనియన్ నేత సురేశ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications