ధర్డ్ వేవ్ ఎఫెక్ట్- వేగంగా కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ -రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి మరోసారి పెరుగుతోంది. అదే సమయంలో కొత్తగా పుట్టుకొచ్చిన ఓమిక్రాన్ వైరస్ కేసులూ భారీగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం మరోసారి దీనిపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్టాలకు కీలక సూచనలు చేసింది. వీటిని తప్పకుండా పాటించాలని సూచించింది.
దేశంలో కోవిడ్ 19 కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ ప్రభుత్వాలకు లేఖ రాశారు, కోవిడ్ పరీక్షలను పెంచాలని, ఆసుపత్రుల్ని బలోపేతం చేయాలని రాష్ట్రాలకు సలహా ఇచ్చారు. ఎలాంటి పరిస్ధితిని అయినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కోరింది.
దేశంలోని 14 నగరాల్లో కోవిడ్ కేసుల్లో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతానికి, పరిస్ధితుల్లో మార్పు కనిపించిన 19 రాష్ట్రాలలో ఢిల్లీ, మహారాష్ట్ర ఓమిక్రాన్ ద్వారా ఎక్కువగా ప్రభావితమైన రెండు రాష్ట్రాలు. అయితే బెంగళూరు, అహ్మదాబాద్‌లలో కూడా ఓమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

దేశ రాజధానిలో పరీక్షించిన 115 కోవిడ్ శాంపిల్స్ లో 46 శాతం ఓమిక్రాన్ కేసులు, కొత్త, వేగంగా వ్యాప్తి చెందుతున్న ఆందోళన క్రమంగా సమాజంలో వ్యాపిస్తోందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఇవాళ తెలిపారు. ఢిల్లీ ఆసుపత్రుల్లో 200 మంది కోవిడ్ రోగులు ఉన్నారని, అందులో 102 మంది నగరానికి చెందినవారని ఆయన చెప్పారు.
24 గంటల వ్యవధిలో, ముంబైలో 2,510 కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ఇది 82% పెరుగుదలగా భావిస్తున్నారు. అలాగే ఢిల్లీలో 24 గంటల్లో 923 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. రెండు రోజులుగా చూస్తే 86 శాతం పెరుగుదల నమోదైంది. ఈ వారం ప్రారంభంలో, ఢిల్లీ నాలుగు-దశల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లేదా GRAPలో భాగంగా - ఎల్లో అలర్ట్ కింద వరుస ఆంక్షలు విధించింది. ఇప్పుడు కేంద్రం కూడా కరోనా పరీక్షలు పెంచాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కోరడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications