8 యూట్యూబ్ న్యూస్ ఛానళ్లపై కేంద్రం బ్యాన్- 114 కోట్ల వ్యూస్, 85 లక్షల సబ్స్-కారణమిదే..
భారత్ లో యూట్యూబ్ ఛానళ్ల హవా అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో వీటిలో జాతి వ్యతిరేక ప్రచారంతో కంటెంట్ కూడా పెరుగుతోంది. దీనికి అడ్డుకట్టే వేసేందుకు కేంద్రం కొరడా ఝళిపిస్తోంది. వరుసగా ఇలాంటి ఛానల్స్ ను బ్లాక్ చేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా 8 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం వేటు వేసింది. ఇందులో ఏడు భారతీయ యూట్యూబ్ ఛానల్స్, ఓ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఛానల్ ఉన్నాయి.
భారత్ లో గతేడాది అమల్లోకి వచ్చిన ఐటీ రూల్స్ ప్రకారం మొత్తం 8 యూట్యూబ్ న్యూస్ ఛానళ్లను బ్లాక్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో ఏడు భారతీయ యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ఓ పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఉన్నాయి. వీటన్నింటిలోనూ భారత్ వ్యతిరేక వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. అందుకే వీటిని బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతే కాదు ఈ ఛానళ్లకు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి.

కేంద్రం బ్లాక్ చేసిన ఎనిమిది యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు కలిపి మొత్తం 114 కోట్ల వ్యూస్ ఉన్నట్లు తేలింది. అంతే కాదు 85.73 లక్షల సబ్ స్క్రైబర్లు కూడా ఉన్నారు. దీంతో వీటికి యూట్యూబ్ నుంచి భారీ ఎత్తున డబ్బు కూడా వస్తోంది. అయితే భారత్ వ్యతిరేక నకిలీ ప్రచారం చేస్తున్నారన్న కారణంతో యూట్యూబ్ కు చెప్పి వీటిని కేంద్రం బ్లాక్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications