Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోర్టులకు వెళ్లకుండానే మధ్యవర్తిత్వం-కేంద్రం కొత్త వ్యవస్ధ- ఆన్ లైన్లోనూ పరిష్కారం-త్వరలో బిల్లు

దేశవ్యాప్తంగా కోర్టులపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో దేశంలో ప్రత్యామ్నాయ వ్యవస్ధల రూపకల్పనకు కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా స్వయంగా సుప్రీంకోర్టే దీనిపై ఆలోచించాలని సూచించడంతో రంగంలోకి దిగిన కేంద్రం.. దీనిపై ఓ బిల్లును పార్లమెంటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లుపై కేంద్రం ప్రజాభిప్రాయం కోరుతోంది. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో పేదలకు సత్వర న్యాయం లభించడంతో పాటు న్యాయవ్యవస్ధ రూపురేఖలే మారిపోనున్నాయి.

 కోర్టుల్లో రెడ్ టేపిజం

కోర్టుల్లో రెడ్ టేపిజం

దేశవ్యాప్తంగా ఉన్న వేలాది కోర్టుల్లో కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీటికి సత్వర పరిష్కారం చూపించే లోపే తిరిగి వాటిపై పై కోర్టుల్లో అప్పీళ్ల రూపంలో తిరిగి ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో పైకోర్టులపై సైతం ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో రెడ్ టేపిజం ( ఫైళ్లు పోగుపడటం) పై దేశంలోని కోర్టులతో పాటు సాధారణ ప్రజల్లో సైతం ముమ్మర చర్చ సాగుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే లోక్ అదాలత్ లతో పాటు ట్రైబ్యునల్స్ కూడా వచ్చాయి. అయినా సమస్య తీవ్రత పెరుగుతోందే కానీ తగ్గడం లేదు.

 ప్రత్యామ్నాయాల వేట

ప్రత్యామ్నాయాల వేట

దేశవ్యాప్తంగా వేలాది కోర్టులు ఉన్నా ఇంకా న్యాయం దక్కడం లేదని దేశంలో సగానికి పైగా జనాభా భావిస్తోంది. దీనికి ప్రధాన కారణం అవే కేసులు తిరిగి మళ్లీ ఓ కోర్టు నుంచి మరో కోర్టుకు తిరుగుతూ ఉండటమే. దీంతో కోర్టులో ఓ కేసు వెళ్లిందంటే ఇక తమకు న్యాయం దక్కినట్లే అని సామాన్యుడు నిట్టూర్చే పరిస్ధితులు వచ్చేస్తున్నాయి. దీనిపై స్వయంగా సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్ధితి. దీంతో సామాన్యుల్లో నానాటికీ కోర్టులు నమ్మకం కోల్పోతున్న పరిస్ధితుల్లో కొత్త కొత్త న్యాయవ్యవస్ధలు అందుబాటులోకి వస్తున్నాయి. లోక్ అదాలత్ లు, ట్రైబ్యునళ్లు, మానవ హక్కుల కమిషన్లు ఇలా పలు ప్రత్యామ్నాయాలు తెరపైకి వచ్చాయి. అయినా సామాన్యుడి వ్యధ మాత్రం తీరడం లేదు.

సీజేఐ రమణ మధ్యవర్తిత్వ సూచన

సీజేఐ రమణ మధ్యవర్తిత్వ సూచన

దేశవ్యాప్తంగా న్యాయస్ధానాలు, లోక్ అదాలత్ లు, ట్రైబ్యునల్స్ లో పెరిగిపోతున్న కేసుల సంఖ్య సామాన్యుల్ని సైతం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇన్ని కేసుల మధ్య తనకు న్యాయం జరుగుతుందన్న ధీమా సడలిపోతోంది. దీంతో తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మధ్యవర్తిత్వాన్ని తెరపైకి తెచ్చారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో అమల్లో ఉన్న మధ్యవర్తిత్వ వ్యవస్ధలను భారత్ లోనూ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టుకు వచ్చిన కేసుల్ని సైతం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి దేశానికి ఓ దారి చూపారు. అదే సమయంలో కేంద్రాన్ని సైతం మధ్యవర్తిత్వ వ్యవస్దల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

 మధ్యవర్తిత్వ వ్యవస్ధకు కేంద్రం రెడీ

మధ్యవర్తిత్వ వ్యవస్ధకు కేంద్రం రెడీ

నేరుగా సుప్రీంకోర్టే తమకు ప్రత్యామ్నాయంగా వ్యవస్ధ ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరడంతో ఇక క్షణం ఆలస్యం చేయకుండా కేంద్రం రంగంలోకి దిగింది. దేశంలో కోర్టులకు ప్రత్యామ్నాయంగా మధ్యవర్తిత్వ వ్యవస్ధ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకోసం తాజాగా ఓ ముసాయిదా బిల్లు కూడా రూపొందించి ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. ప్రజాభిప్రాయం తెలుసుకున్నాక దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి సాధ్యమైనంత త్వరగా కొత్త వ్యవస్ధ ఏర్పాటు చేయాలని కేంద్రం పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వ్యవస్ధ ఏర్పాటుకు ఎంతో కాలం పట్టేలా లేదు.

Recommended Video

    నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తేవాలి
    మధ్యవర్తిత్వ వ్యవస్ధ ఎలా ఉంటుందంటే...

    మధ్యవర్తిత్వ వ్యవస్ధ ఎలా ఉంటుందంటే...


    కొత్త మధ్యవర్తిత్వ వ్యవస్ధ ఏర్పాటుకు కేంద్రం అంతర్జాతీయంగా అమల్లో ఉన్న రాజీ, మధ్యవర్తిత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంది. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న సింగపూర్ తరహా మధ్యవర్తిత్వ నిబంధనలపై ఇప్పటికే సంతకం చేసిన భారత్.. అదే క్రమంలో జాతీయ, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం ఓ సంస్ఘాగత వ్యవస్ధతో పాటు సామాజిక మధ్యవర్తిత్వం కోసం ఓ సంస్ధను కూడా ఏర్పాటు చేయబోతోంది. అలాగే తక్కువ ఖర్చులో మధ్యవర్తిత్వం పూర్తి చేసేందుకు వీలుగా ఆన్ లైన్ వ్యవస్ధను కూడా అందుబాటులోకి తెస్తోంది. కోర్టు కెళ్లకుండా ప్రీలిటిగేషన్ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారంతో పాటు అవసరమైతే కోర్టులకూ వెళ్లే వీలు కల్పిస్తోంది. మధ్యవర్తిత్వం ద్వారా అంగీకరించిన అంశాలకు చట్ట రూపం కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది. మధ్యవర్తిత్వంలో ఉండే కక్షిదారుల వివరాలు రహస్యంగా ఉంచి వారికి రక్షణ కల్పిస్తారు. మధ్యవర్తిత్వం ద్వారా కుదుర్చుకున్న ఒప్పందాలు క్షేత్రస్ధాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్ధలుంటాయి. దీనిపై ప్రస్తుతం కేంద్రం ప్రజాభిప్రాయం కోరుతోంది. ఆ తర్వాత బిల్లు పార్లమెంటులో పెట్టి ఆమోదిస్తారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+