దక్షిణాదికి కేంద్రం మరో భారీ షాక్ ? కొత్త మెడికల్ కాలేజీలొద్దు-సీట్లూ పెంచుకోవద్దు..!

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రాంతంలోని ఐదు రాష్ట్రాలకు మరో భారీ షాకిచ్చింది. తాజాగా కేంద్రం మెడికల్ కాలేజీలు కేటాయించిందని తెలుగు రాష్ట్రాలు సంబరపడుతున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై దక్షిణాది రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు రాకపోగా.. ఉన్న కాలేజీల్లోనూ సీట్లు పెంచుకునే వెసులుబాటు ఉండదు.

తాజాగా కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచుకోకుండా నిషేధం విధించడంతో పాటు కొత్తగా మెడికల్ కాలేజీలు కూడా ఇవ్వకుండా ఓ కీలక నిబంధన విధించింది. ప్రతీ 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఇచ్చేలా విధించిన ఈ నిబంధన కారణంగా ఇప్పటికే అంతకు మించి సీట్లు కలిగి ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. అలాగే కొత్తగా సీట్లు కోరే అవకాశం కూడా ఉండదు.

centres shock to southern states as new nmc guidelines suggest no new medical colleges, seats

వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం కొత్త అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ కాలేజీలను స్థాపించడానికి దరఖాస్తులు 50, 100, 150 సీట్లకు మాత్రమే అనుమతిస్తారు. ఆ రాష్ట్రంలోని లక్ష జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల నిష్పత్తి నిబంధనను సదరు వైద్య కళాశాల పాటించాల్సి ఉంటుందని మార్గరదర్శకాల్లో పేర్కొన్నారు. వీటిని పాటిస్తేనే జాతీయ వైద్య కమిషన్ సదరు కాలేజీల్ని, సీట్లను గుర్తిస్తుంది.

తాజాగా పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం 2021 నాటికి 7.64 కోట్ల జనాభాకు తమిళనాడులో 11,600 సీట్లు ఉన్నాయి. అలాగే కర్ణాటకలో 6.68 కోట్ల జనాభాకు 11,695 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 5.27 కోట్ల జనాభాకు 6,435 సీట్లు, కేరళలో 3.54 కోట్ల జనాభాకు 4,655 సీట్లు ఉన్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం తమిళనాడులో దాదాపు 7,600 సీట్లు, కర్ణాటక 6,700 సీట్లు, ఆంధ్రప్రదేశ్ 5,300 సీట్లు, కేరళ 3,500 సీట్లు, తెలంగాణ 3,700 సీట్లు మాత్రమే కలిగి ఉండాలి. అలాగే అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ డాక్టర్-జనాభా నిష్పత్తి 1:1,000 కంటే కూడా ఎక్కువగా ఉంది.

కేంద్రం తాజా మార్గదర్శకాలు జిల్లాకో మెడికల్ కాలేజీ కావాలని కోరుకుంటున్న దక్షిణాది రాష్ట్రాలు ఏపీ, కర్నాటక, తమిళనాడుకు శరాఘాతం కానున్నాయి. తాజా మార్గదర్శకాలపై ఆయా రాష్ట్రాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్ల నిబంధన అమలు హేతుబద్ధతను దక్షిణాది రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. ఉత్తరాది వెనుకబాటును దక్షిణాదిపై రుద్దుతారా అని మండిపడుతున్నాయి. దీనిపై న్యాయపోరాటానికి సైతం సిద్ధమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+