వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజద్రోహ చట్టంపై కేంద్రం యూటర్న్-పునఃపరిశీలిస్తామని సుప్రీంకోర్టుకు హామీ

|
Google Oneindia TeluguNews

దేశంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశద్రోహం కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా భారీ ఎత్తున రాజద్రోహం కేసులు పెడుతోంది. తమకు నచ్చనివారిపై రాజద్రోహం కేసులు పెట్టడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోతోంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, దీనిపై విచారణ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశద్రోహ చట్టం (సెక్షన్ 124ఎ)లోని నిబంధనలను పునఃపరిశీలిస్తామని కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ వలసవాద చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవద్దని, కేంద్రం చేసే పునర్విచారణ ప్రక్రియ కోసం వేచి ఉండాలని ప్రభుత్వం కోర్టును కోరింది. దేశద్రోహ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తున్న పిటిషనర్ల విచారణను మే 10వ తేదీగా సుప్రీంకోర్టు ముందుగా నిర్ణయించింది.

Centre U-turn on sedition law, tells Supreme Court that it will be re-examined

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మూడు పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దేశ సార్వభౌమత్వాన్ని కొనసాగించడానికి, రక్షించడానికి అలాగే కాలం చెల్లిన వలస చట్టాలను తొలగించడానికి కట్టుబడి ఉందని పేర్కొంది. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నప్పుడు, ప్రభుత్వం వలసరాజ్యాల వాసనల్ని తొలగించడానికి కృషి చేస్తోందని కేంద్రం పేర్కొంది. దేశద్రోహ చట్టాన్ని సమర్థిస్తూ కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో తీర్పు కట్టుబడి ఉందని, దానిని పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది.

వాస్తవానికి రాజద్రోహ చట్టంలోని సెక్షన్ 124A ప్రకారం ఒక వ్యక్తి ద్వేషం లేదా ధిక్కారాన్ని తీసుకురావడం లేదా ప్రయత్నించడం లేదా చట్టం ప్రకారం ఏర్పడిన ప్రభుత్వం పట్ల అసంతృప్తిని ప్రేరేపించడం లేదా ప్రయత్నించడం వంటివి చేస్తే దేశద్రోహ నేరానికి పాల్పడినట్లు అవుతుంది. దీని ప్రకారం గరిష్టంగా జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీంతో ఈ చట్టంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
the union government on today took u turn on sedition law and assured supreme court to reexamine the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X