చక్కా జామ్ అలర్ట్: ఢిల్లీలో భారీగా పోలీసుల మొహరింపు, సరిహద్దులో సాయుధ బలగాలు

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. శనివారం చక్కా జామ్ చేపట్టబోతున్నారు. ఢిల్లీ సరిహద్దు సింగు, టిక్రీ, ఘజీపూర్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులు నిరసనకు అనుమతి లేదని డిల్లీ పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఆందోళనకారుల నిరసన నేపథ్యంలో రోడ్లపై ముళ్ల కంచె, బ్యారికేడ్లు, కందకాలను ఏర్పాటు చేశారు. పోలీసులతోపాటు సాయుధ భద్రతా సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. అలాగే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేయొద్దని కోరుతున్నారు. రూమర్లను ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అలర్టయ్యారు. ఢిల్లీలోకి చొచ్చుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నారు.

Chakka jam: Barricades, thousands of policemen on watch today

పోలీసులతోపాటు సాయుధ భద్రతా సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలు, హర్యానా, ఉత్తరప్రదేశ్ గుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన హింసను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సరిహద్దు గుండా నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నామని వివరించారు. నిరసనలను దృష్టిలో ఉంచుకొని అసాంఘీక శక్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర సైనిక బలగాలతో పహరా ఏర్పాటు చేశారు. నగరంలోని 12 మెట్రో రైల్వేస్టేషన్లపై పోలీసులు నిఘా ఉంచారు. ఎర్రకోట వద్ద భారీఎత్తున పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద చక్కా జామ్ సందర్భంగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులు గుమికూడకుండా చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కానన్లను సిద్ధం చేసి ఉంచారు. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ లలో శాంతియుతంగా నిరసన తెలుపుతామని రైతు సంఘాల నేతలు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+