నేడే జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం: హైదరాబాద్‌కు జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
రాంఛీ: జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత జార్ఖండ్ శాసనసభ పక్ష నేతగా సీనియర్ ఎమ్మెల్యే చంపై సొరెన్‌ను జేఎంఎం ఎమ్మెల్యేలు ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు రాజ్‌భవన్ బాటపట్టారు.
Champai Soren to take oath as Jharkhand CM on 2nd February, floor test to take place in next 10 days: Alamgir Alam, CLP leader https://t.co/PniG8gnpPV
— ANI (@ANI) February 1, 2024
తాజాగా, గురువారం రాత్రి రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఈ క్రమంలో శుక్రవారం (ఫిబ్రవరి 2న) ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణం చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. జేఎంఎం సభ్యుల వినతికి గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటారని గవర్నర్‌ను కలిసిన అనంతరం సీఎల్పీ నేత ఆలంగిర్ ఆలమ్ తెలిపారు.

హైదరాబాద్‌కు జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల తరలింపు ఆలస్యం: రంగంలోకి రేవంత్
ప్రతిపక్ష బీజేపీ ఎక్కడ తమ ఎమ్మెల్యేలను వారి వైపు తిప్పుకుంటుందనే ఆందోళనతో జేఎంఎం, కాంగ్రెస్ రాష్ట్రం దాటించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా వారిని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు తరలించేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే, విమానం కాసేపట్లో బయల్దేరుతుందనగా ప్రతికూల వాతావరణం కారణంగా వారి ప్రయాణం ఆగిపోయింది. శుక్రవారం ఉదయానికి జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.
#WATCH | MLAs of the JMM-led ruling alliance in Jharkhand come out of Ranchi Airport as their flight could not take off due to low visibility. pic.twitter.com/SfR5BuiyHv
— ANI (@ANI) February 1, 2024
జార్ఖండ్ సంక్షోభం నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం రేవంత్ ఏర్పాట్లు చేశారు. శామీర్ పేటలోని ఓ ప్రైవేట్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలను ఉంచే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలను ఫాంహౌస్‌కు తరలించేందుకు బేగంపేట విమానాశ్రయంలో బస్సులను సిద్ధంగా ఉంచారు.
#WATCH | Telangana: Buses placed outside Begumpet airport in Hyderabad.
— ANI (@ANI) February 1, 2024
MLAs of JMM-led ruling alliance in Jharkhand have departed from Ranchi Airport and are likely to reach Hyderabad soon. pic.twitter.com/B1nRKSVTuD
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications