రాజకీయ వివక్ష చూపడం హేయం: చంద్రబాబు, 25 వేల కోట్ల దోపిడీకి తెరలేపారన్న లోకేష్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంభిస్తున్న విధానాలపై మాజీ సీఎం, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలకు కారణం ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. కరోనా, వరదలతో ఇబ్బందులెదుర్కొంటున్న ప్రజలను ఈ సర్కారు పట్టించుకోవడం లేదని మడిపడ్డారు.
Recommended Video

రాజకీయ వివక్ష హేయం..
ఉభయగోదావరి జిల్లాల టీడీపీ నేతలతో శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. వరద నీటి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర జలసంఘం హెచ్చిరికలను బేఖాతరు చేసిందని ఆరోపించారు. వరద బాధితులపై రాజకీయ వివక్ష చూపడం హేయమని దుయ్యబట్టారు. ప్రభుత్వ పరిహారం అందించడంలో పార్టీలను చూస్తారా? అని ప్రశ్నించారు.

వైసీపీది పైశాచిక ఆనందం..
పంటలు దెబ్బతిన్న రైతులందర్నీ అన్ని విధాలా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 100 శాతం సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందజేయాలని కోరారు. వరద బాధితులను ఆదుకున్న టీడీపీ నాయకులకు ఆయన అభినందించారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. టీడీపీ ప్రజలతోనే ఉంటుందన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

25వేల కోట్ల దోపిడీకి తెరతీశారు.. దళితుడ్ని చంపేసి..
మరోవైపు టీడీపీ నేత నారా లోకేష్ కూడా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.మద్యపాన నిషేధం పేరుతో 25 వేల కోట్ల దోపిడీకి తెరలేపారు వైఎస్ జగన్. నిషేధం పేరుతో జరుగుతున్న నిషా దందాని బయటపెట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రతాప్ ని దారుణంగా హత్య చేసారు. స్వయంగా జిల్లా మంత్రి, ఎంపీ ఈ హత్య వెనుక ఉన్నారు. వాస్తవాలు బయటకు రానివ్వకుండా కనీసం కేసు కూడా నమోదు చెయ్యకుండా నిజాన్ని పూడ్చేసారు. విషయం బయటకు రావడంతో ఇప్పుడు కేసు, పోస్ట్ మార్టం అంటున్నారు. అది హత్య కాకపోతే ప్రభుత్వానికి భయమెందుకు? టిడిపి నాయకులను ఆ గ్రామానికి వెళ్లకుండా ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు?పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు ఎంపీ పక్క ఊరిలో ఎందుకు ఉన్నట్టు. దళిత యువకుడ్ని చంపేసి ఆధారాలు లేకుండా చేస్తారా? ఓం ప్రతాప్ హత్యపై న్యాయ విచారణ జరగాలి.ప్రభుత్వంపై గళమెత్తిన ప్రతాప్ ని కడతేర్చిన వారికి కఠినశిక్ష పడాలి.దళితులు రాష్ట్రంలో స్వేచ్ఛగా జీవించే వాతావరణం కల్పించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!










Click it and Unblock the Notifications