బాబు ప్లాన్: ఏప్రిల్ నుంచి విజయవాడ నుంచే పాలన
విజయవాడ: ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని విజయవాడ కానుంది. హైదరాబాదు నుంచి కార్యాలయాలను విజయవాడకు తరలించి పాలనను అక్కడి నుంచే సాగించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేశారు. 2015 ఏప్రిల్ నుంచి పాలన మొత్తం విజయవాడ నుంచే సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల సంద్భంగా విజయవాడకు విచ్చేసిన చంద్రబాబు వేడుకల అనంతరం గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది విజయవాడ నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. కార్యాలయాలక కోసం తాత్కాలిక నిర్మాణాలు చేపడుతామన్నారు.
ఏప్రిల్ నుంచి తాను, తన సహచర మంత్రులు ఇక్కడే ఉంటామని చెప్పారు. నూతర రాజధానిలో నీటి సమస్యపై దృష్టిసారిస్తామన్నారు. వచ్చే నెలలో పోలవరం కుడికాలువ లిఫ్ట్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. కృష్ణా డెల్టాకు 70 టీఎంసీల గోదావరి జలాలను వినియోగిస్తామని బాబు చెప్పారు. అదేవిధంగా కరువు ప్రాంతమైన రాయలసీమకు కృష్ణా జలాలను తరలిస్తామని చెప్పారు. వచ్చే నెల నుంచి ఇళ్ల వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు. వీఆర్‌ఓలకు ట్యాబ్‌లు ఇస్తామని, ట్యాబ్‌ల ద్వారా పెన్షనర్ల వేలిముద్రలు సేకరిస్తామని చంద్రబాబు తెలిపారు.

జగన్ పార్టీపై విసుర్లు
నవ్యాంధ్ర రాజధానిపై కొందరు రాజకీయం చేస్తున్నారని వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదో నెపం పెట్టుకుని తప్పుడు ఆటలు ఆడుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. రాజధాని ప్రాంత రైతుల రుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనను నమ్మి రైతులు భూములు ఇచ్చారని. వారికి అన్యాయం జరగదని.. ఏ జోన్‌లో పొలం ఉంటే అదే జోన్‌లో వారికి స్థలాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో పేద కుంటుంబాలకు నెలకు రూ. 2500ల పెన్షన్ ఇస్తామని, గ్రామ కంటాలకు పట్టాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గ్రామస్తులు ఎవరూ ఇళ్లు వదిలి పోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వృద్ధాశ్రమాలు, ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని బాబు హామీ ఇచ్చారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. డబ్బు సంపాదించే మార్గం చూపిస్తామని బాబు చెప్పారు. వీలైనంత త్వరగా ఏపీకు కార్యాలయాల తరలింపు జరుగుతుందని ఆయన తెలిపారు.
పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తాం
గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తామని చంద్రబాబు చెప్పారు. గోదావరిలోని వరద నీటిని మాత్రమే ఎత్తిపోతల ద్వారా తీసుకుని వెళ్తామని, అధికారం తెచ్చి పెట్టిన గోదావరి జిల్లాలకు అన్యాయం జరగనివ్వమని ఆయన చెప్పారు. గురువారంనాడు ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష జరిపారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు ఆయనకు ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications