• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్రలో నిలిచిపోయే ప్రయోగం .. భవిష్యత్ అద్భుతాలకు సంకేతం చంద్రయాన్ 2

|
Google Oneindia TeluguNews

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన దేశం మొత్తం గర్వించిన ప్రయోగం చంద్రయాన్-2. అంతరిక్ష పరిశోధనలో భారత శాస్త్రవేత్తలు చివరి నిమిషం వరకు పోరాడి అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోయినా, భారత శాస్త్రవేత్తలు చేసిన కృషి నిరుపమానం. స్వయంగా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో చెప్పి భారత దేశం యావత్తు శాస్త్రవేత్తలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. భారత ప్రధాని చెప్పటమే కాదు భారత దేశ ప్రజలందరూ శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతూ మేమున్నాం , మీరు ముందుకు నడవండి అంటున్నారు.

చంద్రయాన్ -2 ..ప్రకాశవంతమైన భవిష్యత్ కోసం భారత్ మీకు అండగా ..ఆత్మ స్థైర్యం నింపిన మోడీ ప్రసంగంచంద్రయాన్ -2 ..ప్రకాశవంతమైన భవిష్యత్ కోసం భారత్ మీకు అండగా ..ఆత్మ స్థైర్యం నింపిన మోడీ ప్రసంగం

 చంద్రయాన్ 2.. శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతున్న యావత్ దేశం .. మీకు అండగా ఉంటామంటూ భరోసా

చంద్రయాన్ 2.. శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతున్న యావత్ దేశం .. మీకు అండగా ఉంటామంటూ భరోసా

చంద్రయాన్-2 చివరి ఘట్టంలో విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ తెగిపోవడంతో ఒకింత నిరాశకు గురైనప్పటికీ జాబిలిపై అద్భుతాలు సృష్టించాలని భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఆఖరి క్షణం వరకు పోరాటం సాగించిన చంద్రయాన్ 2 చివరి క్షణాల్లో నిరాశ కలిగించినప్పటికీ, భవిష్యత్ పై మాత్రం ఆశలను ప్రేరేపిస్తుంది. ఖచ్చితంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవిష్యత్తులో జాబిలిపై అద్భుతాలు సృష్టించే ప్రయోగాలు చేస్తుందనే విషయం చంద్రయాన్-2 ద్వారా తేటతెల్లమైంది. ప్రధాని నరేంద్ర మోడీ చంద్రయాన్ 2 ఫెయిల్ అయిందని ఎవ్వరూ రాయరు అని చెప్పారు. ఆఖరి క్షణం వరకు పోరాటం సాగించిన యుద్ధ వీరుడు చంద్రయాన్ 2 అని భారత సమాజం మొత్తం గర్వంగా చెప్తున్న పరిస్థితి.

శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పిన మోడీ ... మేమున్నామని భరోసా ఇచ్చిన ప్రముఖులు

శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పిన మోడీ ... మేమున్నామని భరోసా ఇచ్చిన ప్రముఖులు

భారత ప్రధాని నరేంద్ర మోడీ నే కాదు, భారతదేశంలోని రాజకీయ నాయకులు, ప్రముఖులు, క్రీడాకారులు మరియు సాధారణ పౌరులు ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలకు మద్దతుగా నిలిచారు. శనివారం చంద్రయాన్ -2 యొక్క ల్యాండర్ చంద్రుడి ఉపరితలం సమీపానికి వెళ్ళాక కమ్యూనికేషన్ కట్ అవటంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు నిరాశ చెందారు . ఇక దీనిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చిన్న విజయం కాదు. దేశం మీ గురించి గర్వపడుతోంది అని మోడీ అన్నారు. దేశంలోని ప్రముఖులందరూ, దేశ ప్రజలందరూ ఇస్రో చేసిన అద్భుత ప్రయోగాన్ని కొనియాడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ కు ఆఖరి క్షణాల్లో అవరోధం ఏర్పడి నేపథ్యంలో దీని కోసం శ్రమించిన శాస్త్రవేత్తలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇక శాస్త్రవేత్తల్లో మనోధైర్యం నింపేందుకు అందరూ ముందుకుకొస్తున్నారు. మీరంతా దేశానికి గర్వకారణమని ఇప్పటికే ప్రధాని మోదీ వారిపై ప్రశంసలు కురిపించారు. జీవితంలో జయాపజయాలు సహజమని.. దేశ కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన అన్నారు. మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇస్రోకు బాసటగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నారు.

చంద్రయాన్ 2 చివరి నిముషం వరకు చేసిన పోరాటానికి గర్వపడుతున్న భారత దేశ ప్రజలు

ఇది భారత దేశ ప్రజలు సైతం ఇస్రో శాస్త్రవేత్తలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే చంద్రయాన్-2 పై సాగిన కృషి , శాస్త్రవేత్తలు చేసిన పోరాటం భారత సమాజం ప్రతిక్షణం వీక్షించింది. సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంది. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సమయంలో సంకేతాలు అందకపోవడంతో, కమ్యూనికేషన్ కట్టడంతో ఒకింత నిరాశకు గురైన భారతదేశ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగానికి మాత్రం గర్వంగా తలెత్తింది భారత సమాజం. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు మన శాస్త్రవేత్తలు చేస్తారన్న దానికి ఇది సంకేతమని భారత దేశ ప్రజలు సైతం భావిస్తున్నారు. అద్భుతమైన ఎఫర్ట్ పెట్టిన భారత శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నారు. భవిష్యత్తులో జాబిలిపై అద్భుతాలు సృష్టించే ప్రకాశవంతమైన రోజులను ఇస్రో చూస్తుందని, అందుకు శాస్త్రవేత్తలకు మద్దతుగా ఎప్పటికీ ప్రజలందరూ ఉన్నామని చంద్రయాన్ 2 కు జయ జయ ధ్వానాలు పలుకుతోంది భారతదేశం.

English summary
Politicians, celebrities, sportspersons and common citizens across India stood in solidarity with the Indian Space Research Organisation (ISRO) on Saturday after Chandrayaan-2’s lander went incommunicado barely a couple of kilometres from the moon’s surface.The first words of support following ISRO chairman K Sivan’s disappointing announcement came from Prime Minister Narendra Modi who was at the ISRO control centre in Bengaluru. "Communication has been lost. I could see the anxiety on your faces. There is no need to get disappointed because it is not a small achievement. The country is proud of you," Modi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X