Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chasing: బిజినెస్ మేన్ తో భార్య జంప్, చేజింగ్ చేసి వెంటాడి పట్టుకున్న భర్త, నడిరోడ్డులో క్లైమాక్స్, వైరల్ !

ఆగ్రా/లక్నో: వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. దంపతులకు కూతురు ఉంది. పనిమీద బయటకు వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో కూతురు మాత్రమే ఉండటం, భార్య కనపడకపోవడంతో భర్త ఆందోళన చెందాడు. కూతురిని వెంటపెట్టుకుని చుట్టుపక్కల తెలిసిన వాళ్ల ఇళ్లల్లో భార్య కోసం గాలించినా ఆమె ఆచూకిమాత్రం చిక్కలేదు. బైక్ లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పోయించుకుని కూతుర్ని వెనుక కుర్చోబెట్టుకుని భార్య కోసం గాలించాడు. ఓ వ్యక్తి స్కూటర్ లో వెనుక కుర్చుని వెలుతున్న భార్యను ఆమె భర్త చూశాడు. అంతే స్కూటర్ ఆపమని ఎంత చెప్పినా ఆ వ్యక్తి స్కూటర్ నిలపలేదు. కొన్ని కిలోమీటర్లు భార్య వెలుతున్న స్కూటర్ ను చేజ్ చేసిన భర్త చివరికి వారిని అడ్డుకున్నాడు. వీడు నా ప్రియుడు, నీకంటే బాగా డబ్బులు సంపాధిస్తున్నాడు, వీడితోనే నేను కాపురం చేస్తాను, నీ ముఖం కూడా చూడను అంటూ భార్య ఆమె భర్తకు తేల్చి చెప్పింది. నడిరోడ్డు కూడా అని చూడకుండా భర్త అతని భార్యను దుమ్ములేపేశాడు. భార్య ప్రియుడితో పారిపోతున్న సమయంలో భర్త చేజ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి.

 10 ఏళ్ల క్రితం పెళ్లి

10 ఏళ్ల క్రితం పెళ్లి

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలోని షికంద్రా ప్రాంతంలో సూరజ్, స్వప్నా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. 10 ఏళ్ల క్రితం పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న సూరజ్, స్వప్నా దంపతులు కాపురం చేస్తున్నారు. సూరజ్, స్వప్నా దంపతులకు కూతురు ఉంది. ఇరు వైపుల కుటుంబ సభ్యులు, బంధువులు సూరజ్, స్వప్నా దంపతుల ఇంటికి వెళ్లి వస్తున్నారు.

ఇంట్లో భార్య మాయం

ఇంట్లో భార్య మాయం

పనిమీద బయటకు వెళ్లిన సూరజ్ సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో కూతురు మాత్రమే ఉండటం, భార్య స్వప్నా కనపడకపోవడంతో సూరజ్ ఆందోళన చెందాడు. కూతురిని వెంటపెట్టుకుని చుట్టుపక్కల తెలిసిన వాళ్ల ఇళ్లల్లో భార్య స్వప్నా కోసం గాలించినా ఆమె ఆచూకిమాత్రం చిక్కలేదు. బంధువులు, తెలిసిన వాళ్లకు ఫోన్ చేసిన సూరజ్ అతని భార్య స్వప్నా గురించి ఆరా తీశాడు.

ఆమె నా భార్యనా ? కాదా ప్రియుడి బైక్ లో భార్య జంప్

ఆమె నా భార్యనా ? కాదా ప్రియుడి బైక్ లో భార్య జంప్

బైక్ లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పోయించుకుని కూతుర్ని వెనుక కుర్చోబెట్టుకున్న సూరజ్ ఆగ్రాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ అతని భార్య స్వప్నా కోసం గాలించాడు. ఓ వ్యక్తి స్కూటర్ లో తన భార్యలాగా ఉండే ఓ మహిళ కనపడటంతో సూరజ్ కు అనుమానం వచ్చింది. ఆమె నా భార్యనా, కాదా ? అంటూ ఫాలో చేశాడు. చివరికి బైక్ లో వెలుతోందని నా భార్య స్వప్నా అని సూరజ్ పసిగట్టాడు.

ప్రియుడిని రెచ్చగొట్టిన భార్య

ప్రియుడిని రెచ్చగొట్టిన భార్య


ఓ వ్యక్తి స్కూటర్ లో వెనుక కుర్చుని వెలుతున్న భార్య స్వప్నాను చూసిన ఆమె భర్త సూరజ్ షాక్ అయ్యాడు. భార్య వెలుతున్న స్కూటర్ వెంట సూరజ్ అతని బైక్ నడిపాడు. స్కూటర్ ఆపమని సూరజ్ ఎంత చెప్పినా ఆ వ్యక్తి స్కూటర్ నిలపలేదు. ఏం జరిగినా పర్వాలేదు నువ్వు మాత్రం స్కూటర్ ఆపకూడదు అంటూ స్వప్నా ఆమె ప్రియుడిని ఇంకా రెచ్చగొట్టింది.

నా ప్రియుడు వ్యాపారవేత్త, బాగా డబ్బు ఉన్నాడో..... వాడితోనే ఉంటాను

నా ప్రియుడు వ్యాపారవేత్త, బాగా డబ్బు ఉన్నాడో..... వాడితోనే ఉంటాను

కొన్ని కిలోమీటర్లు భార్య వెలుతున్న స్కూటర్ ను చేజ్ చేసిన సూరజ్ చివరికి రద్దీగా ఉండే రోడ్డులో వారిని అడ్డుకున్నాడు. స్కూటర్ ఆపిన వెంటనే సూరజ్ అతని భార్యను పట్టుకుని చితకబాదేశాడు. వీడు నా ప్రియుడు, నీకంటే బాగా డబ్బులు సంపాధిస్తున్నాడు, నీతో పెళ్లి కాకముందే మేము ప్రేమించుకున్నాము, మా తల్లిదండ్రులు నీతో బలవంతంగా పెళ్లి చేశారు అని స్వప్నా ఆమె భర్తకు చెప్పింది

నడిరోడ్డులో భార్యను చితకబాది దుమ్ములేపేశాడు

నడిరోడ్డులో భార్యను చితకబాది దుమ్ములేపేశాడు

ఇన్ని సంవత్సరాల తరువాత కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి నా ప్రియుడు సిద్దంగా ఉన్నాడు అని స్వప్నా ఆమె భర్త సూరజ్ కు చెప్పింది. వీడితోనే నేను కాపురం చేస్తాను, నీ ముఖం కూడా చూడను అంటూ స్వప్నా ఆమె భర్త సూరజ్ కు తేల్చి చెప్పింది. ఆ సందర్బంలో దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన సూరజ్ అతని భార్యను పట్టుకుని చితకబాదేశాడు.

 పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు

పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు

నడిరోడ్డు కూడా అని చూడకుండా సూరజ్ అతని భార్య స్వప్నాను చితకబాది దుమ్ములేపేడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దంపతులతో పాటు భార్య ప్రియుడిని పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లి పంచాయితీలు చేస్తున్నారు. ఆగ్రా నగరంలో భార్య ప్రియుడితో పారిపోతున్న సమయంలో భర్త చేజ్ చేస్తుంటే ఆ సమయంలో కొందరు తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+