Cheating: మంత్రి బళ్లారి శ్రీరాములు పీఏ అరెస్టు, సీఎం కొడుకు నాకు క్లోజ్ ?, మీపని అయిపోతుంది, కోట్లు ?
బెంగళూరు/ బళ్లారి: సీఎం కుమారుడితో నేను చాలా సన్నిహితంగా ఉంటాను, మీకు ఎలాంటి పనులు కావాలన్నా నేను చేసిపెడుతాను, కాంట్రాక్టు పనులు ఇప్పిస్తాను, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాను, మీకు బదిలి చేయిస్తాను అంటూ ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ సీనియర్ మంత్రి పీఏని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మంత్రి పీఏగా ఉంటూ సీఎం కొడుకుతో మీ పనులు అన్నీ చేసిపెడుతానని నమ్మించి వ్యాపారవేత్తను మోసం చేశాడని కేసు నమోదు అయ్యింది. సీఎం కొడుకు నాకు క్లోజ్, మీపని అయిపోయినట్లే అంటూ రూ. కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ మంత్రి బళ్లారి శ్రీరాములు పీఏని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చెయ్యడం కర్ణాటకలో కలకలం రేపింది.

బళ్లారి బ్రదర్స్ కు సన్నిహితుడు
కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు దగ్గర రాజన్న అలియాస్ రాజు ఏపీగా పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి మంత్రి శ్రీరాములకు చాలా నమ్మకమైన వ్యక్తిగా రాజు గుర్తింపు తెచ్చుకున్నాడు. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ బళ్లారి గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు రాజన్న అలియాస్ రాజు చాలా సన్నిహితుడు అని సమాచారం.

సీఎంకు కుమారుడికి క్లోజ్ అని ?
మంత్రి శ్రీరాములు పీఏగా పని చేస్తున్న రాజుకు సాటి మంత్రులు పరిచయం ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై, విజయేంద్ర తనకు చాలా సన్నిహితుడని, మీకు ఎలాంటి పనులు కావాలన్నా తాను చేసిపెడుతానని చాలా మంది దగ్గర మంత్రి శ్రీరాములు పీఏ రాజు భారీ మొత్తంలో కోట్ల రూపాయలు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

మీపని అయిపోయినట్లే
సీఎం బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర నేను చాలా సన్నిహితంగా ఉంటామని, మీకు ఎలాంటి పనులు కావాలన్నా నేను చేసిపెడుతాను, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, కాంట్రాక్టుపనులు ఇప్పిస్తానని, మీకు మంచి చోటకు బదిలి చేయిస్తాను అంటూ ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించి మోసం చేసిన రాజు వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మంత్రి ఇంటి ముందే అరెస్టు
బెంగళూరులోని కర్ణాటక మంత్రి బళ్లారి శ్రీరాములు ఇంటి సమీపంలో ఆయన పీఏ రాజును బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. చాలా సంవత్సరాల నుంచి శ్రీరాములు దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకుని ఆయన పీఏగా పని చేసిన రాజు గతంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఎన్నోబుల్ ఇండియాలో ఉద్యోగం చేశాడని పోలీసులు అంటున్నారు.

మంత్రి పీఏ వ్యాపారాలు
ఓ వ్యాపావేత్తను నమ్మించి మోసం చేశాడని ఆడియో క్లిప్పింగ్స్ సాక్షంగా చిక్కడంతో రాజును అరెస్టు చేశామని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. మంత్రి పీఏ హోదాలో భారీ మొత్తంలో డబ్బులు సంపాధించిన రాజు బళ్లారిలో వాటర్ బాటిల్ ప్లాంట్, మొబైల్ షోరూమ్ లతో పాటు అనేక వ్యాపారాలు చేస్తున్నాడని సీసీబీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications