Cheating: భర్తకు రూ. 3 కోట్లు ఇన్సూరెన్స్, రెండు నెలలకే ప్రాణం పోయింది, భార్య ఏం చేసిదంటే !
బెంగళూరు: ఐటీ హబ్ లోని ఖరీదైన అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. గత ఏడాదిలో భర్త ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులను ఆన్ లైన్ లోనే సంప్రధించాడు. తాను సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, మీ కంపెనీలో ఇన్సూరెన్స్ చెయ్యలని అనుకుంటున్నానని ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాడు. కొన్ని రోజులకే అతను ఫోటో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మూడు నెలల పే స్లిప్ తో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ అడిగిన అన్ని పత్రాలు సమర్పించాడు.
ఇన్సూరెన్స్ కంపెనీలో రూ. 3 కోట్లకు భీమా చేశాడు. ఇన్సూరెన్స్ 28 సంవత్సరాలకు చేసిన ఆ వక్తి మొదటి సంవత్సరం కంతుగా రూ. 51 వేలు చెల్లించాడు. ఇన్సూరెన్స్ చేసిన 2 నెలల 9 రోజులకే అతను చనిపోయాడు. భర్త చేసిన ఇన్సూరెన్స్ పాలసీకి అతని భార్య నామినీగా ఉంది. నా భర్త గుండెపోటుతో చనిపోయాడని భార్య ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని పత్రాలు సమర్పించింది. అన్ని పత్రాలు పరిశీలించిన ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు భార్య అకౌంట్ లో రూ. 3 కోట్లు డబ్బు డిపాజిట్ చేశారు.
అయితే కొన్ని రోజుల తరువాత ఓ వ్యక్తి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులను సంప్రధించి డబ్బులు తీసుకున్న మహిళ భర్త గుండెపోటుతో చనిపోలేదని, అతనికి క్యాన్సర్ ఉందని, అతను చికిత్స చేసుకున్న ఆసుపత్రిలోని పత్రాలు ఇవే అంటూ వాళ్లకు ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. భర్త ఇన్సూరెన్స్ డబ్బులు రూ. 3 కోట్లు డ్రా చేసుకున్న భార్య మీద కేసు నమోదు అయ్యింది. చనిపోయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడు కావడంతో అక్కడ కేసు విచారణ మొదలైయ్యింది.

ఆంధ్రప్రదేశ్ యువకుడు
ఆంధ్రప్రదేశ్ కు చెందిన కృష్ణప్రసాద్ గారాలపట్టి అలియాస్ కృష్ణప్రసాద్ (31) అనే యువకుడు బెంగళూరు చేరుకుని కోరమంగలలోని విట్టసంద్రలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. కృష్ణప్రసాద్ తో పాటు అతని భార్య సుప్రియా కూడా అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నది.

ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులతో ?
గత ఏడాదిలో కృష్ణప్రసాద్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులను ఆన్ లైన్ లోనే సంప్రధించాడు. తాను సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, మీ కంపెనీలో ఇన్సూరెన్స్ చెయ్యలని అనుకుంటున్నానని ఆ కంపెనీ ప్రతినిధులతో కృష్ణప్రసాద్ మాట్లాడాడు. 2021 మార్చి 3వ తేదీన కృష్ణప్రసాద్ అతని ఫోటో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మూడు నెలల పే స్లిప్ తో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ అడిగిన అన్ని పత్రాలు సమర్పించాడు.

రూ. 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేశాడు
2021 మార్చి 3వ తేదీన కృష్ణప్రసాద్ ఇన్సూరెన్స్ కంపెనీలో మహారక్షా సుప్రీం అనే పాలసీకి రూ. 3 కోట్లకు భీమా చేశాడు. ఇన్సూరెన్స్ 28 సంవత్సరాలకు చేసిన కృష్ణప్రసాద్ మొదటి సంవత్సరం కంతుగా రూ. 51, 777 ప్రీమియం చెల్లించాడు. 2021 మార్చి 5వ తేదీన ఇన్సూరెన్స్ చేసినట్లు కృష్ణప్రసాద్ చేతికి కొన్ని పత్రాలు అందాయి.

ఇన్సూరెన్స్ చేసిన రెండు నెలలకే ప్రాణం పోయింది
ఇన్సూరెన్స్ చేసిన 2 నెలల 9 రోజులకే కృష్ణప్రసాద్ చనిపోయాడు. కృష్ణప్రసాద్ చేసిన ఇన్సూరెన్స్ పాలసీకి అతని భార్య సుప్రియా నామినీగా ఉంది. తన భర్త కృష్ణప్రసాద్ గుండెపోటుతో చనిపోయాడని, ఆయన చేసిన ఇన్సూరెన్స్ పాలసీకి తానే నామినిగా ఉన్నాను అంటూ సుప్రియా ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని పత్రాలు సమర్పించింది.

భార్య అకౌంట్ లో రూ. 3 కోట్లు డిపాజిట్
సుప్రియా ఇచ్చిన అన్ని పత్రాలు పరిశీలించిన ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు ఆమె బ్యాంకు అకౌంట్ లో రూ. 3. 2 కోట్లు డబ్బు డిపాజిట్ చేశారు. భర్త కృష్ణప్రసాద్ చనిపోవడంతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకున్న సుప్రియా తరువాత ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులకు పూర్తిగా టచ్ లో లేకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

హడలిపోయిన అధికారులు
2021 డిసెంబర్ 24వ తేదీన రవి అనే వ్యక్తి ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయానికి వెళ్లాడు. ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులను సంప్రధించిన రవి మీ దగ్గర డబ్బులు తీసుకున్న సుప్రియా భర్త కృష్ణప్రసాద్ గుండెపోటుతో చనిపోలేదని, అతనికి క్యాన్సర్ ఉందని, అతను చికిత్స చేసుకున్న ఆసుపత్రిలోని పత్రాలు ఇవే అంటూ వాళ్లకు ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. ఇదే సమయంలో అజిత్ కుమార్, మంజుల అనే ఇద్దరు సుప్రియా మీకు నకిలి పత్రాలు ఇచ్చి మోసం చేసిందని, కృష్ణప్రసాద్ క్యాన్సర్ వ్యాధితోనే చనిపోయాడని ఇంకా కొన్ని పత్రాలు ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహకులకు పంపించారు.

టెక్కీ కాదు..... కంపెనీ మ్యాటర్ లో మోసం జరిగింది
కృష్ణప్రసాద్ అసలు సాఫ్ట్ వేర్ ఇంజనీరు కాదని ఇన్సూరెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఇన్సూరెన్స్ అధికారులు సాఫ్ట్ వేర్ కంపెనీకి వెళ్లి ఆరా తీస్తే అసలు కృష్ణప్రసాద్ మా కంపెనీ ఉద్యోగి కాదని చెప్పారని వెలుగు చూసింది. మొత్తం మీద సుప్రియా నకిలీ పత్రాలు సమర్పించి రూ. 3 కోట్లు మోసం చేసిందని ఇన్సూరెన్స్ కంపెనీ అధికారి పిఎస్. గణపతి బెంగళూరులోని కోరమంగల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. సుప్రియా మీద చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆరా తీస్తున్నారు. సుప్రియాతో డబ్బులు పంచుకునే విషయంలో తేడా రావడంతో వాళ్లే ఆమెను పట్టించడానికి ప్రయత్నించారని సమాచారం.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications