చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

leader: నాతో పెట్టుకుంటే ఇక్కడ బతకలేరు, డబ్బులు వసూలు చేస్తూ జల్సాలు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: దేవాలయం భూముల్లో ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 63 ఏళ్ల వ్యక్తిని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. నాతో పెట్టుకుంటే ఇక్కడ బతకలేరని దేవాల భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడని పోలీసులు అన్నారు.

చెన్నైలోని తిరువల్లికేణిలోని డాక్టర్ నటేసన్ వీధిలో శంకర్ అనే ఆయన నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నిర్మాణ యంత్రాలు అద్దెకు ఇచ్చే దుకాణం నడుపుతున్నాడు. హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు మహేష్‌తో కొంతకాలం క్రితం శంకర్‌కు పరిచయం ఏర్పడింది.
తరువాత శంకర్, మహేష్ స్నేహంగా మెలిగారు. తీర్థపాలీశ్వర దేవాలయం స్థలంలో ఇల్లు కట్టుకున్నావని శంకర్‌ను మహేష్ బెదిరించి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.

Wife: పెళ్లైన మూడు రోజులకే బెడ్ రూమ్ లో భార్య తల్లితో రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టిక్ టాక్ స్టార్Wife: పెళ్లైన మూడు రోజులకే బెడ్ రూమ్ లో భార్య తల్లితో రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టిక్ టాక్ స్టార్

 Chennai Police arrested Hindu Peoples Party leader for illegal money collection.
నేను చెన్నై మున్సిపల్ పార్టీ ఆఫ్ హిందూ పీపుల్స్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అని బెదిరించి మహేష్ వయసు మీదపడిన శంకర్ నుంచి డబ్బులు వసూలు చేశాడు. మరో 20 వేల రూపాయలు కావాలని మహేష్ బెదిరించడంతో శంకర్ ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. శంకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అక్రమంగా అడ్డుకోవడం, బెదిరింపులు, అక్రమ వసూళ్లు చేస్తున్నాడని మహేష్ మీద కేసు నమోదు చేసి హిందూ పీపుల్స్ పార్టీ చెన్నై మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ మహేష్‌ను అరెస్ట్ చేశారు.

అరెస్టయిన మహేశ్‌ను విచారించగా ఇప్పటికే పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. తీర్థపాలీశ్వర ఆలయానికి చెందిన భూమిలో చాలా కుటుంబాలు అద్దెకు ఉంటూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. హిందూ పీపుల్స్ పార్టీకి చెందిన మహేశ్ అనే వ్యక్తి ఆలయ భూమిని లీజ్ కు తీసుకుని నివాసముంటున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు.

Bride: కొత్త పెళ్లికూతురు జంప్, రెండు వారాల్లో ఇద్దరితో పెళ్లి, మూడు నెలల గర్బతి, ట్వీస్ట్ లే ట్విస్ట్ లు !Bride: కొత్త పెళ్లికూతురు జంప్, రెండు వారాల్లో ఇద్దరితో పెళ్లి, మూడు నెలల గర్బతి, ట్వీస్ట్ లే ట్విస్ట్ లు !

డబ్బులు ఇవ్వకుంటే ఇక్కడ బతకలేరని బెదిరించిన మహేష్ పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటికే మహేష్ పై ఆత్మహత్యకు ప్రేరేపించడంతోపాటు 3 కేసులు పెండింగ్ లో ఉన్నాయని పోలీసులు చెప్పారు. హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు మహేష్‌ను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించామని చెన్నై పోలీసులు తెలిపారు.

English summary
Chennai Police arrested Hindu People's Party leader for illegal money collection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X