వివాహేతర సంబంధం: భర్త గొంతుకోసి, నాటకమాడింది
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను ఎంత చెప్పినా వినకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కోపంతో ఓ మహిళ తన భర్తను దారుణంగా గొంతుకోసి హత్య చేసింది. మొదట దుండగులు దాడి చేసి హత్య చేశారని నమ్మించేందుకు ప్రయత్నించినా.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. మన్నడీలోని కృష్ణన్ కోయిల్ వీధిలో నిందితురాలు ఫదా ముత్తు(49), ఆమె భర్త అక్బర్(54), వారి ఇద్దరు పిల్లలు నివాసముంటున్నారు. వారి ఇంటి పక్కనే అక్బర్ సోదరుడి కుటుంబం కుటుంబం కూడా ఉంటోంది. కాగా, అక్బర్ గత కొంత కాలంగా పులియంతోప్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ వ్యవహారం ఫదా ముత్తుకు ఇష్టం లేదు. ఆ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించవద్దని చాలా సార్లు అక్బర్‌ను కోరింది ఫదా ముత్తు. ఈ విషయమై చాలాసార్లు వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి.

ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా అక్బర్‌తో ఫదా ముత్తు గొడవ పడింది. గొడవ తీవ్రమవడంతో కోపంతో కొబ్బరిబోండాలను కొట్టే కత్తితో అక్బర్‌పై దాడి చేసి గొంతుకోసి చంపేసింది. మంగళవారం తెల్లవారిన తర్వాత తన భర్తను ఎవరో హత్య చేశారంటూ ఇరుగుపొరుగువారిని, అక్బర్ సోదరుడి కుటుంబాన్ని నమ్మించే యత్నం చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంట్లోకి ఎవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో ఫదా ముత్తును తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications